ATM withdrawal : దేశంలో ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఒకటి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే నియమాలలో పెద్ద మార్పు చేసినట్లు సమాచారం. ఈ కొత్త నియమాల ప్రకారం ఏదైనా ఇతర బ్యాంకు ఎటిఎం నుంచి మీరు నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ డబ్బులు విత్డ్రా చేసినట్లయితే ప్రతి లావాదేవీ పై కూడా అదనపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ ఎటిఎం నుంచి అదనపు లావాదేవీలకు గాను రూ.21 ప్లస్ జీఎస్టీ వసూలు చేసేది. కానీ ఈ కొత్త నియమాల ప్రకారం మరొక బ్యాంకు ఎటిఎం నుంచి మీరు గరిష్ట లావాదేవీ పరిమితిని దాటినట్లయితే మరిన్ని చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నియమాల ప్రకారం మీరు ఎన్ని లావాదేవీలను ఉచితంగా పొందుతారో తెలుసుకుందాం.
Also Read : లోన్ తీసుకున్నారా? మీ EMI తగ్గబోతోంది.. ఆర్బీఐ సంచలన నిర్ణయం
ఈ కొత్త నియమాల ప్రకారం మెట్రో మరియు నాన్ మెట్రోలోని అన్ని ఖాతాదారులు ప్రతిసారి ఎస్బిఐ ఎటిఎంలలో ఐదు లావాదేవీలు మరియు ఇతర బ్యాంకు ఎటిఎంలలో 10 లావాదేవీల వరకు చేసుకోవచ్చు. అలాగే 25 నుంచి 50 వేల మధ్య ఉన్న amb ఖాతాదారులతో అదనంగా ఐదు లావాదేవీలు వస్తాయి. రూ. 50,000 నుండి లక్ష రూపాయల వరకు ఏ ఎం బి ఉన్న కస్టమర్లకు ఐదు అదనపు లావాదేవీలు వర్తిస్తాయి. ఏఎమ్బి లక్ష రూపాయలు కంటే ఎక్కువ ఉన్న కస్టమర్లకు అపరిమిత ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో బ్యాలెన్స్ విచారణ మరియు మినీ స్టేట్మెంట్ మొదలైన సేవలకు ఎటువంటి చార్జీలు ఉండవు. ఇతర బ్యాంకుల ఏటీఎంలో మీరు బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్మెంట్ విచారణ కొరకు ప్రతి లావాదేవీకి రూ.10 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పొదుపు ఖాతాలో తగినంత డబ్బులు లేక మీ ఏటీఎం లావాదేవీ విఫలమైతే జరిమానా రూ.20 ప్లస్ జీఎస్టీ అలాగే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఇంటర్ చేంజ్ రుసుమును మే ఒకటి, 2025 నుంచి అమలులోకి తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నియమాల ప్రకారం అన్ని బ్యాంకులు మే ఒకటి, 2025 నుంచి గరిష్ట ఏటీఎం ఉపసంహరణ చార్జీని ప్రతి లావాదేవీ కి కూడా రూ.23 కి పెంచుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటిఎం నుంచి కూడా అదనపు లావాదేవీలను చేసినట్లయితే వాళ్లు కూడా ప్రతి లావాదేవీకి రూ.23 చెల్లించాలి.