Credit Card: ఒకప్పుడు క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే ఎన్నో ఆంక్షలు ఉండేవి. ప్రస్తుతం క్రెడిట్ కార్డు కోసం ఏ మాత్రం కష్టం లేదు. కేవలం ఫోన్‌లో కేవైసీ పత్రాలు పొంది క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు ఉంది కదా అని చాలామంది ప్రతి చిన్న అవసరాలను ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి వారి అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా క్రెడిట్ కార్డ్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.మరి క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి ఈ కార్డు ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….
సరైన గడువులోగా బిల్లు చెల్లించాలి: మనం క్రెడిట్ కార్డు నుంచి కొంత అమౌంట్ ను ఉపయోగించి మన అవసరాలు తీర్చుకున్న తరువాత సరైన గడువులోగా మనం డబ్బు చెల్లించాలి. అలా చెల్లించని పక్షంలో బ్యాంక్ మన నుంచి అధిక మొత్తంలో వడ్డీని వసూలు చేస్తుంది. కేవలం వడ్డీ మాత్రమే కాకుండా ఇతర ఛార్జీలు కూడా వర్తిస్తాయి.
లిమిట్ దాటకూడదు: మన దగ్గర క్రెడిట్ కార్డు ఉందన్న ఉద్దేశంతో అవసరానికి మించి,మన ఆర్థిక స్థోమతకు మించి డబ్బులను ఉపయోగించడం వల్ల తిరిగి ఆ డబ్బులు చెల్లించే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరైన సమయంలో డబ్బులు చెల్లించకపోతే ఆ డబ్బు పై వడ్డీ, సరైన సమయానికి చెల్లించకపోతే జరిమానా, జీఎస్టీ లు వంటి వాటిని ఎక్కువగా మనపై వేస్తూ డబ్బులు వసూలు చేస్తారు.
రివార్డ్ పాయింట్ లు: మనం క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేయడం లేదా ఏవైనా బిల్లు చెల్లించే సమయంలో మనకు రివార్డులు ప్రకటిస్తారు. ఈ విధమైనటువంటి రివార్డులను క్యాష్ బ్యాక్ లను ఉపయోగించుకొని నెలాఖరున కొంత ఖర్చులను తగ్గించుకోవచ్చు.
క్రెడిట్ స్కోర్ పై ఎఫెక్ట్: క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు ఉపయోగించినప్పుడు సరైన గడువులోగా డబ్బులను చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ బాగా ఉంటుంది. అలా చేయని పక్షంలో క్రెడిట్ స్కోర్ తగ్గుతూ వస్తుంది.ఇలా క్రెడిట్ స్కోర్ తగ్గడం వల్ల ఆ ప్రభావం ఫ్యూచర్ లో మనకు ఎప్పుడైనా వ్యక్తిగత రుణాలు కావాల్సిన సమయంలో బ్యాంకులు రుణాలు చెల్లించవు. కనుక క్రెడిట్ స్కోర్ ఉండే విధంగా చూసుకోవాలి.