Business Ideas: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా మినరల్ వాటర్ తాగడానికి అలవాటు పడ్డారు.ఈ క్రమంలోని మినరల్ వాటర్ కి ఎంతో డిమాండ్ ఏర్పడటంతో ప్రతి ఒక్క ఊరిలోనూ ఈ విధమైనటువంటి మినరల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్న చాలామందికి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఎవరు పర్మిషన్ తీసుకోవాలనే ఐడియా ఉండదు. అయితే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఎవరి అనుమతి తీసుకోవాలి ఎలా ఏర్పాటు చేయాలి ఈ ప్లాంట్ పెట్టడం వల్ల మనకు ఎంత లాభం వస్తుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….
మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ముందుగా మనం స్థానికంగా మున్సిపల్ ఆఫీస్ లో లైసెన్స్ కోసం అప్లై చేయాలి.FSSAI నుంచి అనుమతి పొందాలి.అనుమతులు వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాతనే ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ముందుగా మనకు బోరుబావి అందుబాటులో ఉండాలి కనుక బోర్ వేయించుకోవాలి. బోర్ వేయించుకొన్న తర్వాత రెండు వాటర్ ట్యాంక్ లు పెద్దవి, ప్యూరిఫైయర్ మిషన్, కొళాయిలు, విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ ఏర్పాటు చేసుకోవడానికి ముందు ఒక షెడ్ వేసుకొని అందులో వీటిని అమర్చుకోవాలి.
Also Read: భర్త పోయాక వివాహిత మెట్టెలు, గాజులు తీసివేయడం వెనకున్న కారణం తెలుసా..?
ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు చేయాలంటే మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కంపెనీ వారే ఏర్పాటు చేస్తారు.ఏదైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత కంపెనీకి సమాచారాన్ని అందజేస్తూ టెక్నీషియన్లు వచ్చి సమస్యకు పరిష్కారం తెలియజేస్తారు. ఇక వాటర్ ప్లాంట్ పూర్తయిన తర్వాత మనం 20 లీటర్ల కాన్స్ వాటర్ నింపి వాటిని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. సాధారణంగా వాటర్ ప్లాంట్ దగ్గరికి వచ్చి నీళ్ళు నింపుకు పోతే ఐదు నుంచి పది రూపాయల వరకు అవుతుంది లేదంటే మనమే ఇంటింటికి సరఫరా చేస్తే మరో ఐదు రూపాయలు అధిక చార్జీలు వసూలు చేస్తారు. ఇక పట్టణాలలో అయితే వీటి ఖరీదు మరింత ఎక్కువగా ఉంటుంది.
ఉదాహరణకు రోజుకు 200 నార్మల్ వాటర్ క్యాన్ లో ఆరు రూపాయలు చొప్పున అమ్మితే నెలకు 36 వేల రూపాయల లాభం వస్తుంది.అయితే కూల్ వాటర్ క్యాన్లను అమ్మితే మరింత ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఒక్కో కూల్ వాటర్ క్యాన్ పది రూపాయల చొప్పున రోజుకు 50 క్యాన్లు అమ్మితే నెలకు 15000 లాభం వస్తుంది ఇలా నెల రోజుల పాటు అమ్మితే నెలకు 51 వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఇక ఈ బిజినెస్ మరింత అభివృద్ధి చేసుకోవాలి అంటే ఏదైనా రెస్టారెంట్లు, హోటల్లుతో ఒప్పందం కుదుర్చుకుంటే ఈ బిజినెస్ మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
Also Read: పక్కరాష్ట్రంలో పీవీపీ రౌడీయిజం.. ఏం ధైర్యం రాజా నీది?