Personal Loans: సాధారణంగా ప్రతి ఒక్కరు వారి వారి అవసరాల నిమిత్తం వ్యక్తిగత రుణాలు తీసుకోవడానికి మక్కువ చూపుతుంటారు.ఈ క్రమంలోనే ఈ వ్యక్తిగత రుణాలు తీసుకోవడం వల్ల కొందరు అనేక సమస్యలను కొని తెచ్చుకుంటారు. అయితే మన అవసరాలు ఈ రుణాలతో తీరుతాయి కనుక ఇవి మంచిది అనుకుంటే కొన్ని సార్లు మనం పొరపాటు పడినట్లే.
వ్యక్తిగత రుణాలు తీసుకునే సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కొన్ని విషయాలను పరిశీలించాలి. మనం వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసుకునే ముందు ఒక్కసారిగా ఈ విషయాలన్నిటినీ పరిశీలించి దరఖాస్తు చేసుకోవడం ఎంతో ఉత్తమం.
అవసరం కన్నా ఎక్కువ రుణం వద్దు: సాధారణంగా మన వ్యక్తిగత రుణం తీసుకుంటున్నాము అంటే తప్పనిసరిగా ఏదో ఒక అవసరం ఉంటుంది. అందుకే మన అవసరానికి సరిపడా డబ్బులు మాత్రమే మనం రుణం తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో తీసుకొని ఆ డబ్బుతో విచ్చలవిడి ఖర్చులు చేసి తిరిగి బ్యాంకు చెల్లించాల్సిన సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మన అవసరానికి ఎంత పడుతుందో అంత మాత్రమే తీసుకోవాలి.
ఆదాయానికి అనుగుణంగా రుణం తీసుకోవాలి: మన వ్యక్తిగత లోన్ తీసుకున్నప్పుడు ఒక్కసారి మన ఆదాయాన్ని కూడా చూసుకోవాలి.మనం లోన్ తీసుకున్న తర్వాత తిరిగి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది కనుక మన ఆదాయానికి తగ్గట్టుగా రుణ తీసుకోవాలి లేదంటే మరికొన్ని చోట్ల అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
రుణ అర్హత తెలుసుకోవాలి: వ్యక్తిగత రుణ సదుపాయం కల్పించడం కోసం ఒక్కో బ్యాంకు ఒక్కో విధమైన ఆఫర్లను ప్రకటిస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే మనం లోన్ తీసుకోవడానికి ఎంత వరకు అర్హత కలిగి ఉన్నాము ఎంత వరకు తీసుకోవచ్చు అనే విషయాలను ముందుగా తెలుసుకున్న తరువాతనే వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి లేదంటే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.