https://oktelugu.com/

LIC Policy: ఎల్‌ఐసీ పాలసీని సరెండర్ చేస్తున్నారా.. గుర్తుంచుకోవాల్సిన విషయాలివే?

LIC Policy: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రీమియం చెల్లించలేక కొంతమంది పాలసీని నిలిపివేస్తుంటే మరికొందరు తర్వాత రోజుల్లో పాలసీ విధానాలు నచ్చకపోయినా పాలసీని నిలిపివేస్తుండటం గమనార్హం. పాలసీలను రద్దు చేసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాలసీని సరెండర్ చేయడం వల్ల పాలసీ కట్టిన వ్యక్తికి డబ్బులు తిరిగి వచ్చే అవకాశం అయితే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 13, 2021 / 07:45 PM IST
    Follow us on

    LIC Policy: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రీమియం చెల్లించలేక కొంతమంది పాలసీని నిలిపివేస్తుంటే మరికొందరు తర్వాత రోజుల్లో పాలసీ విధానాలు నచ్చకపోయినా పాలసీని నిలిపివేస్తుండటం గమనార్హం. పాలసీలను రద్దు చేసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

    పాలసీని సరెండర్ చేయడం వల్ల పాలసీ కట్టిన వ్యక్తికి డబ్బులు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పాలసీని సరెండర్ చేసిన వాళ్లు సరెండర్ ఛార్జీని చెల్లించాలి. ప్రీమియం విలువ, ప్రీమియం చెల్లింపు వ్యవధి, పాలసీ రకాన్ని బట్టి సరెండర్ ఛార్జీ ఆధారపడి ఉంటుంది. పాలసీ తీసుకున్న వ్యక్తికి వచ్చే మొత్తం నుంచి సరెండర్ ఛార్జీని తీసివేసి మిగిలిన మొత్తాన్ని చెల్లించడం జరుగుతుందని సమాచారం.

    సరెండర్ విలువలో గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ, స్పెషల్ సరెండర్ వాల్యూ ఉంటాయి. గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ ప్రకారం పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత మాత్రమే చెల్లించడం జరుగుతుంది. చెల్లించిన పాలసీ డబ్బులలో ఈ విలువ 30 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇందులో తొలి సంవత్సరం చెల్లించిన ప్రీమియంలు, బోనస్ లు, రైడర్లకు చెల్లించే అదనపు ఖర్చులు కూడా ఉండవు.

    స్పెషల్ సరెండర్ వాల్యూలో పాలసీని తీసుకున్న వాళ్లు కొన్నిరోజులు ప్రీమియంను చెల్లించకపోయినా పాలసీని కొనసాగించవచ్చు. ఇందులో చెల్లించిన, చెల్లించాల్సిన ప్రీమియంలను బట్టి బేసిక్ సమ్ అష్యూర్డ్ ను గుణించి విలువను లెక్కించడం జరుగుతుంది. పాలసీదారుడు పాలసీ సరెండర్ ఫామ్ ను నింపడం ద్వారా ఈ మొత్తాన్ని పొందవచ్చు.