Gold buying alert: ప్రపంచంలో జరుగుతున్న ఆర్థిక పరిణామాలు.. డాలర్ విలువ పడిపోవడం వల్ల చాలామంది బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దీంతో బంగారంనకు డిమాండ్ పెరిగిపోతుంది. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 40 వేలకు పైగా బంగారం ధర పెరిగినట్లు తెలుస్తోంది. అయితే మిగతా దేశాల్లో కంటే భారతదేశంలోనే బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు కేవలం ఆభరణాల కోసం మాత్రమే కొనుగోలు చేసేవారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం పెట్టుబడి కోసం బంగారం అస్సలు కొనవద్దని అంటున్నారు. అలా చేస్తే భారీగా నష్టపోతారని పేర్కొంటున్నారు. మరి బంగారం కొనడం వల్ల ఎలా నష్టపోతారో ఇప్పుడు చూద్దాం..
2025 సంవత్సరం ప్రారంభంలో బంగారం కొనుగోలు చేసిన వారు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 10 గ్రాముల బంగారం ధర అప్పటికి ఇప్పటికి 35 నుంచి 40,000 వరకు పెరిగింది. దీంతో 100 గ్రాముల బంగారం ఉన్నవారు ఎంతో లాభపడ్డమని సంతోషంతో ఉన్నారు. ఈ క్రమంలో వారిని చూసి ఇతరులు కూడా బంగారం కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు. వాస్తవానికి బంగారం అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాలి. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఎంత మాత్రం పనికిరాదు. ఎందుకంటే భారతదేశంలో బంగారంపై మేకింగ్ చార్జి తో పాటు జీఎస్టీ భారీగా ఉంటుంది. దీంతో ఒకసారి కొన్న బంగారం తిరిగి విక్రయించడం వల్ల అనుకున్న మొత్తం రాకపోవచ్చు.
ఉదాహరణకు రూ. 3 లక్షలు వెచ్చించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారని అనుకుందాం. ఇందులో 22% మేకింగ్ చార్జ్ ఉంటుంది. అలాగే 3 శాతం వరకు జిఎస్టి ఉంటుంది. అంటే ఇందులో అసలైన బంగారం విలువ రూ.2,38,774 ధర వేస్తారు. మేకింగ్ ఛార్జ్ రూ.52,530 విధిస్తారు. జీఎస్టీ రూ.8696 వేస్తారు. అంటే మీరు 3 లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఇందులో అసలైన బంగారం ధర రూ.2,38,774 మాత్రమే. ఎందుకంటే ఈరోజు బంగారం కొనుగోలు చేశారని అనుకుందాం. ఒక పది రోజుల తర్వాత తిరిగి దానిని అమ్మాలని అనుకుంటున్నారు. ధర ఏమాత్రం పెరగలేదు.. అలాగని తగ్గలేదు.. స్థిరంగానే ఉంది. మీరు కొన్న ఆభరణాలు తిరిగి విక్రయించాలి అనుకుంటే మీకు వచ్చేది రూ.2,38,774 మాత్రమే.
అయితే గోల్డ్ బిస్కెట్ లేదా లిక్విడ్ బంగారం కొనుగోలు చేసిన కూడా మేకింగ్ చార్జెస్ విధిస్తారు. అయితే భవిష్యత్తులో పాప మ్యారేజ్ లేదా ఆభరణాలుగా ధరించడానికి మాత్రం బంగారం కొనుగోలు చేయవచ్చును. ఎందుకంటే భవిష్యత్తులో బంగారం తగ్గినా.. పెరిగినా.. ఎలాంటి నష్టం ఉండదు. కానీ కేవలం పెట్టుబడుల కోసం మాత్రం బంగారం ఎంత మాత్రం పనికిరాదు అని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.