Buying SIM Cards from Roadside: ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ తప్పనిసరి. ఒకరితో ఒకరు మాట్లాడడానికి మాత్రమే కాకుండా ఉద్యోగం, వ్యాపారం చేయడానికి కూడా ఫోన్ లేకుంటే నడవదు. అయితే ఫోన్ కొనసాగాలంటే అందులో సిమ్ తప్పనిసరి. ఒకప్పుడు సిమ్ కావాలంటే దరఖాస్తు చేసుకున్న రెండు లేదా మూడు రోజుల్లో వచ్చేది. ఈ దరఖాస్తులకు పెద్ద క్యూ ఉండేది. కానీ ఇప్పుడు సిమ్ కావాలంటే 15 నిమిషాల్లో చేతులో పెడుతున్నారు. ఇలాంటి ఫామ్ లేకుండా ఆన్లైన్లోనే అంతా ఫార్మాలిటీస్ పూర్తి చేసి సిమ్ను ఇచ్చేస్తున్నారు. అయితే ఈ సిమ్ కోసం ఆధార్ కార్డు ను మాత్రం తప్పనిసరి చేశారు. అయితే కొందరు దీనిని అదునుగా చేసుకొని రోడ్డు పక్కన సిమ్ములు అమ్ముతూ.. ప్రజల ప్రైవేట్ డేటాను చోరీ చేస్తూ.. ఇతరులకు అమ్ముకుంటున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?
మనదేశంలో ఏ వస్తువైనా తక్కువ ధరకు వస్తుందంటే ఎక్కువమంది అక్కడ కనిపిస్తారు. అయితే కొన్నిసార్లు ఇవి నాణ్యమైన వా? కావా? అని ఆలోచించారు. తక్కువ ధరకు వచ్చిన వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత మోసపోయామని తెలిసి బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు కొనే ముందే తక్కువ ధరకు ఎందుకు ఇస్తున్నారు? అనేది తెలుసుకోవాలి. సిమ్ కార్డు విషయంలో కూడా ఇదే పాటించాలి. ఒక్కోసారి రోడ్డు పక్కన చిన్న టెంట్ లాగా వేసుకొని సిమ్ కార్డులు అమ్ముతూ ఉంటారు. ఒకప్పుడు వీటికి కొంత ధర ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం.. కేవలం ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటాం అని చెబుతున్నారు. దీంతో కొందరు వినియోగదారులు ఉచితంగా సిమ్ ఇస్తున్నారని ఆశతో వెంటనే కొనుగోలు చేస్తున్నారు.
ఇలా సిమ్ కార్డును కొనుగోలు చేసే క్రమంలో వారికి సంబంధించిన ఆధార్ వివరాలను తీసుకుంటున్నారు. అలాగే తంబు ప్రెస్ కూడా తీసుకుంటున్నారు. అయితే రోడ్డు పక్కన ఇలా సిమ్ కొనుగోలు చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొందరు ఫేక్ సిమ్ కార్డులను విక్రయిస్తూ వినియోగదారులకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నారు. సిమ్ కార్డు కొనుగోలు చేసిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ ఆ సిమ్ కార్డు నాణ్యమైనదే అనుకున్నా… వినియోగదారుల నుంచి సేకరించిన డాటాను వీరు విక్రయించే అవకాశం ఉంది.
Also Read: 50 వేల పెట్టుబడి.. నెలకు 7.5 లక్షల ఆదాయం..
ప్రస్తుతం సిమ్ కార్డు వారు ఉచితంగానే ఇస్తున్న.. వినియోగదారుల డేటాను విక్రయించి లక్షల రూపాయలు ఆర్జించే అవకాశం ఉంది. అయితే ఆ డేటాను కొందరు సైబర్ క్రైమ్ నేరగాళ్లు కొనుగోలు చేసి తప్పుడు పనులకు వాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఎవరినైనా కిడ్నాప్ చేయడానికి ఫోన్ చేయడానికి ఇలా వినియోగదారుల నుంచి స్వీకరించిన డేటాను ఉపయోగించి సిమ్ కార్డులను కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ఏదైనా సమస్య వస్తే ఆధార్ కార్డు ఎవరిదో వారిపైనే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
అందువల్ల తక్కువ ధరకు వస్తుంది కదా అని సిమ్ కార్డు కొనుగోలు చేయవద్దు. బ్రాండెడ్ స్టోర్ లోకి వెళ్లి మాత్రమే సిమ్ కార్డులను కొనుగోలు చేయాలి.