LPG Subsidy Updates: దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వినియోగించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీమ్స్ అమలుతో పేద ప్రజలు కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వినియోగించే విధంగా చేస్తోంది. గత కొన్నేళ్లలో గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఎవరైతే గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేస్తారో వాళ్ల ఖాతాలలో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ జమవుతోంది.
గత కొన్ని నెలలుగా సబ్సిడీని నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ అర్హులైన వాళ్ల ఖాతాలలో సబ్సిడీని జమ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. కొంతమంది లబ్ధిదారుల ఖాతాలలో 158.52 రూపాయలు జమవుతుండగా మరి కొందరి ఖాతాలో 237.78 రూపాయలు జమవుతోంది. అయితే అన్ని అర్హతలు ఉన్నా కొంతమంది ఖాతాలలో మాత్రం నగదు జమ కావడం లేదు. మీ ఖాతాకు సబ్సిడీ నగదు జమ కాకపోతే ఎందుకు జమ కావడం లేదనే వివరాలను తెలుసుకోవాలి.
Also Read: మహామ్మరి ‘ఒమ్రికాన్’.. అప్రమత్తంగా ఉండాల్సిందే..!
ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ కాకపోయినా బ్యాంకు ఖాతా వివరాలను తప్పుగా నమోదు చేసినా ఆధార్, పాన్ నంబర్ వివరాలను తప్పుగా నమోదు చేసినా సబ్సిడీ డబ్బులను పొందడానికి అవకాశం అయితే ఉండదని చెప్పాలి. సబ్సిడీ రాని వాళ్లు 18002333555 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి సబ్సిడీ పొందవచ్చు. లేదా www.mylpg.in వెబ్ సైట్ కు వెళ్లి సర్వీస్ ప్రొవైడర్ ను ఎంచుకుని కుడివైపున సైన్ ఇన్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
ఆ తర్వాత వివరాలను ఎంటర్ చేసి వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్‌ను ఎంచుకొని సబ్సిడీ పొందుతున్నారా? లేదా? అనే వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. వార్షికాదాయం 10 లక్షల రూపాయల లోపు ఉంటే మాత్రమే సబ్సిడీ పొందడానికి అర్హత ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి నెలా సిలిండర్ ధర పెరుగుతుండటంతో సబ్సిడీ అంతకంతకూ తగ్గుతోంది.
Also Read: ప్రజలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు షాక్!