spot_img
Homeబిజినెస్iPhone 13 discount India: సేల్స్ పెంచుకునేందుకు ఈ ఫోన్ పై డిస్కౌంట్ ఇచ్చిన ...

iPhone 13 discount India: సేల్స్ పెంచుకునేందుకు ఈ ఫోన్ పై డిస్కౌంట్ ఇచ్చిన Apple కంపెనీ..

iPhone 13 discount India: భారతదేశంలో iPhone ప్రేమికులు ఎక్కువగానే ఉంటారు. Apple కంపెనీ నుంచి వచ్చే ఈ మొబైల్స్ ఎటువంటి సిరీస్ అయినా దక్కించుకోవడానికి ఎగబడతారు. ఇప్పటికే ఎన్నో రకాల సిరీస్ లు మార్కెట్లోకి వచ్చాయి. అయినా కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటికే వచ్చిన ఐఫోన్ ధరపై భారీ డిస్కౌంట్ను ఇస్తున్నారు. మార్కెట్ ప్లాట్ఫామ్ క్రోమా ద్వారా దీనిని తక్కువ ధరకే అందిస్తున్నారు. ఈ ఫోన్ వివరాల్లోకి వెళితే..

మార్కెట్లో ఎక్కువగా ఆదరణ పొందుతున్న యాపిల్ కంపెనీకి చెందిన iphone 13 మొబైల్లో ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లో ఉన్నాయి. ఇందులో డ్యూయల్ కెమెరా సిస్టంను అమర్చారు. దీంతో ఏఐ తరహాలో ఫోటోలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ లో 6.1 అంగుళాల OLED డిస్ప్లే ఉండడంతో పాటు 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉండనుంది. ఇందులో 12 MP మెయిన్ కెమెరా ఉండడంతో పాటు ఆల్ట్రా వైడ్ కెమెరా కూడా పనిచేస్తుంది. అలాగే 12 MP ఫ్రంట్ కెమెరా ఉండడంతో సెల్ఫీతో పాటు వీడియో రికార్డింగ్ కోసం కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ కెమెరాతో 4కె వీడియో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ మొబైల్లో 3,227 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ కి 15 W వైర్లెస్ చార్జర్ సపోర్ట్ చేస్తుండగా..7.5 W వైర్డ్ చార్జర్ సపోర్ట్ చేయనుంది. ఈ మొబైల్లో A15 బయోనిక్ చిప్ ప్రాసెసర్ తో పాటు 128 జీబీ స్టోరేజ్ ఉండడంతో కావాల్సిన ఫోటోలను, వీడియోలను స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 5G కనెక్టివిటీ వేగవంతంగా ఉండడంతో ఇటువంటి ప్రాంతంలో నైనా నెట్వర్క్ అందుకునే విధంగా ప్రాసెసర్ ఉండనుంది.

అయితే ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ నో ఇప్పుడు క్రోమా ప్లాట్ ఫామ్ పై తక్కువ ధరకే అందిస్తున్నారు. ప్రస్తుతం iphone 13 మొబైల్ ధర రూ.49,900 తో విక్రయిస్తున్నారు. దీనిపై రూ.4,210 ప్లాట్ డిస్కౌంట్ పొందనున్నారు. అంటే రూ.45,690 కె ఈ మొబైల్ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేదు. కానీ ఐఫోన్ తక్కువ ధరకు వస్తుందని తెలియడంతో చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. భారతదేశంలో ఐఫోన్ ప్రియులు ఎక్కువగా ఉంటారు. ఇందులో భాగంగా ఈ ఫోన్ పై ధర తగ్గడంతో మరింతగా విక్రయాలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version