https://oktelugu.com/

Anant Radhika Sangeet: మనవళ్లు, మనవరాళ్లతో ముఖేష్ అంబానీ జాయ్ రైడింగ్.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ తమ కూతురు, కొడుకు పిల్లలతో కారులో షికారు చేస్తూ దర్శనమిచ్చారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 6, 2024 / 01:46 PM IST

    Anant Radhika Sangeet

    Follow us on

    Anant Radhika Sangeet: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహం జరగనుంది. ఇప్పటికే వివాహానికి సంబంధించిన సంబరాలు మొదలయ్యాయి. శుక్రవారం రాత్రి అతిరథ మహారధుల మధ్య సంగీత్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. సంగీత్ వేడుక సంబంధించి ఒక ప్రత్యేక వీడియోను అంబానీ కుటుంబం విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది.

    సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ తమ కూతురు, కొడుకు పిల్లలతో కారులో షికారు చేస్తూ దర్శనమిచ్చారు. వింటేజ్ ఓపెన్ టాప్ కారును ముఖేష్ డ్రైవ్ చేశారు. ఆ కారులో ముఖేష్ పక్కన నీతా అంబానీ కూర్చున్నారు. ఆమె ఒడిలో మనవళ్లు పృథ్వి, కృష్ణ, మనవరాళ్లు ఆద్యశక్తి, వేద ఉన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ అలనాటి నటుడు షమ్మీ కపూర్ నటించిన బ్రహ్మచారి అనే సినిమాలోని చక్కే మే చక్కా అనే పాటను నీతా, ముఖేష్ ఆలపిస్తూ.. షికారు చేస్తున్నట్టుగా ఉన్న వీడియోను సంగీత్ వేడుకల్లో ప్రదర్శించారు.. ఈ వేడుకల్లో అంబానీ కుటుంబం మొత్తం డ్యాన్స్ చేసింది. ఇది సంగీత్ కార్యక్రమం మొత్తానికి హైలైట్ గా నిలిచింది.

    ఇక షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాలోని దివాంగి అనే పాటకు ముఖేష్ – నీతా, ఆకాష్ – శ్లోక, ఆనంద్ – ఈషా, అనంత్ – రాధిక స్టెప్పులు వేశారు.. చివర్లో నీతా అంబానీ భరతనాట్యం వేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ వేడుకలు మరో రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. ఆకాష్ – రాధిక వివాహానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు హాజరుకానున్నారు. ఇప్పటికే జియో వరల్డ్ సెంటర్ లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు.