Health Emi: ప్రస్తుత కాలంలో ఎంతోమందిని ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎవరిని ఏ సమయంలో ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కరోనా కేసులు పెరిగిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ను తీసుకునే వాళ్ల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది. అయితే కేసులు పెరుగుతున్న సమయంలో హైదరాబాద్ లోని అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ రోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
4 లక్షల రూపాయల వరకు తీసుకున్న రుణాన్ని ఈ.ఎం.ఐలోకి మార్చుకోవడానికి బజాజ్ ఫిన్ సర్వ్ అవకాశం కల్పిస్తుండటం గమనార్హం. కరోనాతో పాటు పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురైన సమయంలో కూడా ఈ రుణాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఎదురై ఇబ్బందులు వస్తే తగినంత బీమా లేనివాళ్ల కోసం ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ ఈఎంఐ సదుపాయం ద్వారా బెనిఫిట్ పొందే ఛాన్స్ కల్పిస్తోంది.
అయితే ఉద్యోగులు, వ్యాపారుల క్రెడిట్ స్కోర్ ను బట్టి అర్హత ఉంటే మాత్రమే లోన్ ను పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. బిల్లులో మూడో వంతు చెల్లించి నాలుగు లక్షల రూపాయల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆస్పత్రిని సంప్రదించి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.