Ampere Reo VYB Electric Scooter: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరిగిపోతుండడంతో చాలా మంది వీటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కొందరు బడ్జెట్ గురించి ఆలోచిస్తుండగా.. సిటీలో ఉండేవారు స్టైలిష్ డిజైన్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ప్రముఖ ఈవీ బ్రాండ్ ‘ఆంపియర్’ (Ampere) భారత మార్కెట్లోకి ఆంపియర్ రియో వివైబి (Ampere Reo VYB) ను విడుదల చేసింది. ఇది ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గా పేర్కొంటున్నారు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసేవారు, విద్యార్థులకు ఇది అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా దీని స్టైలిష్ డిజైన్ చూసి ఇంప్రెష్ అవుతున్నారు. ఇంతకీ దీని ధర ఎంతంటే? , మరియు వృద్ధులను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్‌ను కంపెనీ రూపొందించింది.
ఆంపియర్ రియో VYB డిజైన్ పరంగా చాలా స్పోర్టీగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీని ఫ్రంట్ ఎప్రాన్‌పై అమర్చిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డే-టైమ్ రన్నింగ్ లైట్స్ స్కూటర్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. అయితే, ఈ స్కూటర్ డిజైన్‌లో భాగంగా దీని సైడ్ బాడీ ప్యానెల్స్‌పై ఇచ్చిన ‘అంబియంట్ సైడ్ లైటింగ్’ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా రాత్రి వేళల్లో కూడా ఈ స్కూటర్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.
ఈ స్కూటర్ డిజైన్‌ను కేవలం స్టైల్ కోసమే కాకుండా ఇతర పనులకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఏకంగా 24 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ అందించారు. దీనివల్ల కాలేజీ బ్యాగులు, హెల్మెట్ లేదా నిత్యావసర సరుకులను సరఫరా చేసుకోవచ్చు. రైడర్ల సౌకర్యం కోసం విశాలమైన సీటుతో పాటు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపు డ్యాంపర్ సెటప్ ఇచ్చారు. దీనివల్ల ఇరుకైన రోడ్లపై కూడా ప్రయాణం సాఫీగా సాగుతుంది. అదనంగా, లేడీస్ ఫుట్‌రెస్ట్ కూడా కంపెనీ యాక్సెసరీగా అందిస్తోంది.
ఈ స్కూటర్ ఒక లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇందులో 250W హబ్ మోటార్‌ను ఉపయోగించారు. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంత తక్కువ వేగం ఉన్న స్కూటర్లను నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ గానీ అవసరం లేదు. ఇది కాలేజీ విద్యార్థులకు, ఇంటి అవసరాల కోసం తిరిగే వారికి చాలా పెద్ద ప్లస్ పాయింట్.
ఈ స్కూటర్ హార్ట్‌గా 1.44 kWh సామర్థ్యం గల లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. భారతదేశంలోని వేడి వాతావరణానికి, ట్రాఫిక్‌కు ఈ LFP బ్యాటరీలు అత్యంత సురక్షితమైనవి. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది 80 కిలోమీటర్ల నిజమైన రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. సాధారణ సాకెట్ ద్వారా దీనిని 5 నుండి 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అంతేకాదు, ఈ బ్యాటరీ లైఫ్‌కాలం ఏకంగా 1,00,000 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఆంపియర్ హామీ ఇస్తోంది. వార్మ్ వైట్, పాస్టెల్ పర్పుల్, డార్క్ గ్రే, మరియు ఆక్వా మెటాలిక్ వంటి 4 ట్రెండీ కలర్ ఆప్షన్లలో లభించే దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను ₹69,499 గా నిర్ణయించారు.
