Ambassador : దేశాన్ని ఏలిన అంబాసిడర్ మళ్లీ మార్కెట్లోకి.. డిజైన్ పూర్తి.. ఎప్పుడంటే..?

Ambassador : డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ అంబాసిడర్ కారుంటే చాలు.. జీవితంలో ఒక్కసారైనా ఈ కారులో తిరగాల్సిందే.. అసలు ఈ కారు మన ఇంట్లోనే ఉంటే.. ఒకప్పుడు ధనవంతులు అని చెప్పుకోవడానికి అంబాసిడర్ కారు కొనుక్కునేవారు. ఈ కారు ఇంట్లో ఉంటే స్టేటస్ సింబల్ గా భావించేవారు. స్వాతంత్రానికి ముందు నుంచి రోడ్లపై తిరుగుతున్న అంబాసిడర్ కారు దాదాపు ఏడు దశాబ్దాల పాటు భారత్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ కారును మార్కెట్లోకి […]

Written By: NARESH, Updated On : May 28, 2022 10:38 am
Follow us on

Ambassador : డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ అంబాసిడర్ కారుంటే చాలు.. జీవితంలో ఒక్కసారైనా ఈ కారులో తిరగాల్సిందే.. అసలు ఈ కారు మన ఇంట్లోనే ఉంటే.. ఒకప్పుడు ధనవంతులు అని చెప్పుకోవడానికి అంబాసిడర్ కారు కొనుక్కునేవారు. ఈ కారు ఇంట్లో ఉంటే స్టేటస్ సింబల్ గా భావించేవారు. స్వాతంత్రానికి ముందు నుంచి రోడ్లపై తిరుగుతున్న అంబాసిడర్ కారు దాదాపు ఏడు దశాబ్దాల పాటు భారత్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ కారును మార్కెట్లోకి తెచ్చిన హిందుస్తాన్ మోటార్స్ అప్పులు ఊబిలో చిక్కుకోవడంతో 2014లో ఉత్పత్తిని నిలిపివేసింది. వీటితో పాటు మోడ్రన్ కార్లు రావడంతో అంబాసిడర్ తట్టుకోలేకపోయింది. దీంతో అంబాసిడర్ కనుమరుగైంది. అయితే ఇప్పుడు అంబాసిడర్ కారును కొత్త లుక్ లో దించనున్నారట. మళ్లీ దీనిని డిజైన్ మార్చి మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

బ్రిటిష్ కారు అయిన మోరీస్ అక్స్ ఫర్డ్ సిరీస్ లో భాగంగా 1957లో హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్ కారును తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. తమ ఇంట్లో ఈ కారు ఉంటే చాలు.. అని మన భారతీయులు స్టేటస్ సింబల్ గా ఫీలయ్యే వారు. ఎందుకంటే సీఎం నుంచి పీఎం వరకు ఈ కార్లను వాడేవారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు అడ్డూ అదుపూ లేకుండా మార్కెట్లోకి విరివిగా అంబాసిడర్ కార్లు వచ్చాయి. ఈ కారు కేవలం ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే ఉండేది. కాలక్రమంలో యువతరం ఈ కార్లను పక్కన పెట్టేశారు. మార్కెట్లోకి కొత్త కార్లు రావడంతో అంబాసిడర్ ను మరిచిపోయారు.

దేశంలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీ హిందుస్తాన్ మోటార్స్ (హెచ్ఎం) అంబాసిడర్ కార్లను తయారు చేసేది. అయితే 2014కు ముందు సంస్థ బాగా అప్పుల్లో కూరుకుపోయింది. వీటితో పాటు ఈ కార్లకు డిమాండ్ తగ్గిపోవడంతో 2014లో ఈ సంస్థ ఓనర్ బిర్లా గ్రూప్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఉత్పత్తిని నిలిపివేసే ముందు చివరి కారును పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర్ పరాలోని హిందూస్తాన్ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది. ఆ తరువాత 2017లో ఫ్రెంచ్ కంపెనీ ఈ అంబాసిడర్ బ్రాండ్ ను రూ.80 కోట్లకు దక్కించుకుంది. అప్పటి నుంచి ఈ కారు గురించి పూర్తిగా మరిచిపోయారు.

ఇప్పుడు అంబాసిడర్ 2.0. మార్కెట్లోకి రాబోతుంది. హిందూస్తాన్ మోటార్స్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్రెంచ్ కార్ మేకర్ అయిన ఫుజో కంపెనీతో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి అంబాసిడర్ 2.0.ను తయారు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన డిజైన్ కూడా రెడీ చేశారట. త్వరలోనే భారతీయ రోడ్లపై మరోసారి అంబాసిడర్ హవా చూపనుందని తయారీదారులు పేర్కొంటున్నారు. కొత్త లుక్ ను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని హిందూస్తాన్ మోటార్స్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ అన్నారు. కారుకు సంబంధించిన ఫొటోలు త్వరలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

అంబాసిడర్ 2.0. కొత్త లుక్ కారును చెన్నైలో తయారు చేయనున్నట్లు సమాచారం. ఇక్కడున్న సీకె బిర్లా గ్రూప్ నకు చెందిన హిందుస్తాన్ మోటార్స్ సంస్థ కార్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్ నుంచే కొత్తకారు మార్కెట్లోకి రానుంది. నేటితరం యువతను ఆకట్టుకునేలా కారును డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడున్న వారిలో ఎక్కువగా విదేశీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. కానీ అంబాసిడర్ బ్రాండ్ తో యువతకు నచ్చే విధంగా తయారు చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు అంటున్నారు. అయితే నేటి కార్లతో పోటీపడి అంబాసిడర్ తట్టుకుంటుందా..? లేదా..? చూడాలి.

రాబోయే రెండేళ్లలో మొదటి కారు బయటకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. కొత్త ఇంజన్ కోసం మెకానికల్, డిజైన్ వర్క్ తుది దశకు చేరుకుందని తెలిపారు. ఒకప్పుడు అంబాసిడర్ కార్లు చెన్నై ప్లాంటులోనే ఎక్కువగా ఉత్పత్తి చేశారు. ఇప్పుడు కూడా చెన్నై ప్లాంటునే ప్రధాన కేంద్రంగా ఉంచనున్నారు. ఇక్కడి నుంచే దేశ వ్యాప్తంగా కార్లు సరఫరా కానున్నాయి. దీంతో కొత్త అంబసిడర్ ఎలా ఉంటుందోనని యువత, కార్ల ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవతరం కార్లతో కొత్త అంబాసిడర్ పోటీపడుతుందా? లేదా అన్నది చూడాలి.