Agriculture: 10,000 రూపాయలతో లక్షల్లో సంపాదిస్తున్న రైతు.. ఎలా అంటే?

Agriculture: భారతదేశం వ్యవసాయంపై ఆధారపడిన దేశం అనే సంగతి తెలిసిందే. దేశంలో రోజురోజుకు వ్యవసాయం చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. కొంతమంది ఔత్సాహికులు వ్యవసాయానికి టెక్నాలజీని జోడించి మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు. మేఘాలయ రాష్ట్రానికి చెందిన నానాడో బి. మరక్ అనే రైతు నల్ల మిరియాల సాగుతో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వ్యవసాయం విషయంలో కొత్తగా ఆలోచించిన ఈ రైతు పద్మశ్రీ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఈ రైతు కేవలం సేంద్రీయ ఎరువును మాత్రమే […]

Written By: Navya, Updated On : November 27, 2021 5:07 pm
Follow us on

Agriculture: భారతదేశం వ్యవసాయంపై ఆధారపడిన దేశం అనే సంగతి తెలిసిందే. దేశంలో రోజురోజుకు వ్యవసాయం చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. కొంతమంది ఔత్సాహికులు వ్యవసాయానికి టెక్నాలజీని జోడించి మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు. మేఘాలయ రాష్ట్రానికి చెందిన నానాడో బి. మరక్ అనే రైతు నల్ల మిరియాల సాగుతో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వ్యవసాయం విషయంలో కొత్తగా ఆలోచించిన ఈ రైతు పద్మశ్రీ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు.

Agriculture

ఈ రైతు కేవలం సేంద్రీయ ఎరువును మాత్రమే వినియోగించి వ్యవసాయం చేస్తుండటం గమనార్హం. పది వేల రూపాయల పెట్టుబడితో కిర ముండా అని పిలిచే నల్ల మిరియాల రకాలను సాగు చేసి ఈ రైతు లక్షల్లో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. పురుగుమందులను వాడకపోవడంతో ఈ రైతు పండించిన మిరియాలకు దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్ లో భారీస్థాయిలో డిమాండ్ నెలకొంది.

Also Read: ఫైనాన్స్ లో బైక్ తీసుకోవడం మంచిదేనా.. నిపుణులేం చెప్పారంటే?

ఈ రైతు గ్రామంలోని ఇతర రైతులకు కూడా తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. 2019 సంవత్సరంలో నల్ల మిరియాల ద్వారా ఈ రైతు 19 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం సంపాదించారు. ఆ తర్వాత సంవత్సరంసంవత్సరానికి ఈ రైతు సంపాదన అంతకంతకూ పెరుగుతోంది. నల్ల మిరియాల సాగు కోసం ఆవు పేడ లేదా వర్మీ కంపోస్ట్ ఎరువును ఉపయోగిస్తే మంచిదని చెప్పవచ్చు.

ప్రత్యేకమైన యంత్రం సహాయంతో నల్లమిరియాలను కోస్తారు. నల్ల మిరియాలను ఎండబెట్టడం అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉండదు. ఈ విధంగా రైతులు మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చు.

Also Read: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ!