Aditya Birla Sun Life Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వలన చాలా అద్భుతమైన రాబడి పొందొచ్చు. చిన్న మొత్తంలో పెట్టుబడి చేస్తూ దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడిని అందించే ఎన్నో పథకాలు మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న అద్భుతమైన పథకాలలో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా ఒకటి. చాలామంది ప్రతినెలా పదివేల రూపాయలు ఖర్చు చేసేస్తూ ఉంటారు. వీకెండ్ సమయాలలో కుటుంబంతో కలిసి డిన్నర్ బిల్లు లేదా వారంలో ఒకటి రెండు సార్లు షాపింగ్ ఖర్చులు అలా ఒక నెలలో పదివేల రూపాయలు సులభంగా ఖర్చు చేసేస్తారు. కానీ ఈ పదివేల రూపాయలను మీరు క్రమం తప్పకుండా 25 ఏళ్ల పాటు ఈ స్కీం లో పెట్టుబడిగా పెట్టినట్లయితే మీరు ఏకంగా రూ.1.6 కోట్లు అందుకోవచ్చు. ఇది నిజంగా చాలా అద్భుతమైన స్కీం అని తెలుస్తుంది. మనదేశంలో దిగ్గజ మ్యూచువల్ ఫండ్ సంస్థలలో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన స్కీమ్. మీకు మెచ్యూరిటీ సమయంలో అధిక రాబడి కావాలంటే ఎక్కువ రిస్క్ మీరు తీసుకోవాల్సిందే. అయితే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ వేరే విధంగా ఉంటుందని చెప్పొచ్చు.
ఈక్విటీల ద్వారా వచ్చే లాభాలను దీర్ఘకాలిక వృద్ధిని ఆశించే పెట్టుబడిదారుల కోసం ఏప్రిల్ 25, 2000న ఈ స్కీం ప్రత్యేకంగా రూపొందించబడింది. తక్కువ రిస్క్ స్థాయిలతో ఇది మీకు దీర్ఘకాలంలో స్థిరమైన రాబడిని అందిస్తుంది. నెలకు కేవలం 10000 రూపాయల చొప్పున మీరు 25 ఏళ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.30 లక్షలు అవుతుంది. అయితే దాని విలువ మొత్తం ఏకంగా రూ.1.6 కోట్లకు పైగా వృద్ధి చెందుతుంది. వార్షికంగా ఈ పండు మీకు 11.7% వృద్ధిరేటును అందిస్తుంది.
దీని పనితీరు ఎంత అద్భుతమో చెప్పాలంటే 2015 నుంచి మీరు దాదాపు 80% వరకు నిఫ్టీ ఇచ్చిన రాబడిలో ఈ ఫండ్ అందించింది అని తెలుస్తుంది. మార్కెట్లో హెచ్చుతగ్గులు జరుగుతున్న సమయంలో కూడా ఈ ఫండ్లో మీరు పెట్టిన పెట్టుబడి చాలా వరకు సురక్షితంగా ఉంటుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో మార్కెట్కు దగ్గరగా లేదా కొన్ని కొన్ని సార్లు అంతకంటే మెరుగైన రాబడులను కూడా ఈ ఫండ్ అందిస్తుంది.