https://oktelugu.com/

Success Story: వెయ్యి రూపాయల పెట్టుబడితో రూ.కోట్లు సంపాదిస్తున్న మహిళ.. ఎలా అంటే?

Success Story: మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో చిన్నచిన్న దెబ్బలు తగిలి రక్తం వస్తుంది. ఆ సమయంలో పసుపును దెబ్బ తగిలిన చోట పెడితే సమస్య దూరమవుతుంది. ఈ చిట్కా వైద్యాన్ని ఫాలో అయ్యేవారు దేశంలో చాలామంది ఉన్నారు. అయితే ఒక యువతి తన అమ్మమ్మ నేర్పిన చిట్కాలను పాటించి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ యువతి పేరు ఆకాంక్ష మోదీ కాగా ఊరు కోల్ కతా. కేవలం 1,000 రూపాయల పెట్టుబడితో ఆమె కోట్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 15, 2021 12:23 pm
    Follow us on

    Success Story: మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో చిన్నచిన్న దెబ్బలు తగిలి రక్తం వస్తుంది. ఆ సమయంలో పసుపును దెబ్బ తగిలిన చోట పెడితే సమస్య దూరమవుతుంది. ఈ చిట్కా వైద్యాన్ని ఫాలో అయ్యేవారు దేశంలో చాలామంది ఉన్నారు. అయితే ఒక యువతి తన అమ్మమ్మ నేర్పిన చిట్కాలను పాటించి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ యువతి పేరు ఆకాంక్ష మోదీ కాగా ఊరు కోల్ కతా. కేవలం 1,000 రూపాయల పెట్టుబడితో ఆమె కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.

    Success Story

    Success Story

    ఇంటి నుంచే చర్మ సంరక్షణ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం ద్వారా 7 సంవత్సరాలు గడిచేసరికి ఈ యువతి ఆదాయం 4 కోట్ల రూపాయలకు చేరింది. ఆకాంక్ష అత్తగారు ఒక చర్మ సంబంధిత సమస్యతో బాధ పడగా వైద్యులు ఇచ్చిన మందుల వల్ల ఆ సమస్య తగ్గకపోవడంతో ఆకాంక్ష సొంతంగా మందును తయారు చేసి ఇచ్చారు. ఆ మందు వల్ల ఆకాంక్ష అత్తగారి సమస్య తగ్గింది. అనంతరం ఆకాంక్ష తన మందులను వ్యాపారంగా మార్చే ప్రక్రియను మొదలుపెట్టారు.

    Also Read: ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్!

    వివిధ మూలికలపై అధ్యయనం చేసిన ఆకాంక్ష మొదట చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లకు మందులను ఫ్రీగా ఇచ్చారు. ఆ తర్వాత ఈమె మందులకు రోజురోజుకు డిమాండ్ పెరిగింది. అమ్మకాలు చేసిన సొమ్మునే తిరిగి పెట్టుబడిగా పెట్టానని ఆమె చెప్పుకొచ్చారు. ఎనిమిది ఉత్పత్తులతో ఆకాంక్ష పనిని ప్రారంభించగా ప్రస్తుతం ఆమె 80 రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఈ ఉత్పత్తులు పూర్తిగా ఆయుర్వేద ఉత్పత్తులు కావడం గమనార్హం.

    ప్రముఖ ఈకామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో కూడా ఉత్పత్తులను విక్రయిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన దగ్గర 52 మంది పని చేస్తున్నారని ఆమె వెల్లడించారు. సరైన ఆలోచన, ప్రణాళిక, ఓపిక ఉంటే సక్సెస్ సాధించవచ్చని ఆకాంక్ష ప్రూవ్ చేశారు.

    Also Read: ఈ యాప్ తో దేశంలోని అన్ని భాషలు సులువుగా నేర్చుకోవచ్చు.. ఎలా అంటే?