Gachibowli real estate offer: హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా ఒకప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఉండేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ వంటి ప్రాంతాలు ఆక్రమించాయి. ఈ ప్రాంతాలలో చదరపు గజం ధర దాదాపు లక్షల్లో పలుకుతుంది. భారీగా డబ్బు చెల్లించి కొనుగోలు చేద్దామనుకున్నా స్థలాలు అమ్మేవారు లేరు.
హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన గచ్చిబౌలి ప్రాంతంలో 26 లక్షలకే ప్లాటు లభిస్తోంది. చదువుతుంటే మీకు ఆశ్చర్యంగా అనిపించిన.. ఇది ముమ్మాటికి నిజం. హైదరాబాద్ నగరంలోని అత్యంత విలాసవంతమైన గచ్చిబౌలి ప్రాంతంలో దిగువ ఆదాయ వర్గాల కోసం హౌసింగ్ బోర్డ్ గృహ సముదాయాలను నిర్మించింది. ఇందులో నిర్మించిన ప్లాట్లను విక్రయించడానికి రంగం సిద్ధం చేసింది. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ దిగువ ఆదాయ వర్గాల ప్రజలకు సొంత ఇంటి కలను నిజం చేయడానికి కృషి చేస్తోంది.
తెలంగాణ హౌసింగ్ బోర్డు గతంలో ప్రైవేట్ డెవలపర్ల సహాయంతో సంయుక్త విధానంలో వెంచర్లు నిర్మించింది. ఆ ప్రాజెక్ట్ లలో ప్రభుత్వం వాటాగా వచ్చిన ప్లాట్లను విక్రయించడానికి రాంకం సిద్ధం చేసింది. హైదరాబాదులోనే గచ్చిబౌలి లో మొత్తం 111 ప్లాట్లను విక్రయించడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ సన్నాహాలు చేస్తోంది. అల్ప ఆదాయ వర్గాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. ఉన్నచోట ఉన్నట్టు అనే విధానంలో ప్లాట్లను విక్రయించనుంది. అంతేకాదు టోకెన్ అడ్వాన్స్ చెల్లించిన దరఖాస్తుదారుల మధ్య అత్యంత పారదర్శకమైన విధానంలో లాటరీ తీసి.. ప్లాట్లను విక్రయించనుంది.
ప్రధాన ఐటి కారిడార్లు గా పేరుపొందిన హైటెక్ సిటీ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉన్న నేపథ్యంలో గచ్చిబౌలి లో భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. వీటిని క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. అందువల్ల ఇక్కడ స్థలాలతోపాటు, రెసిడెన్షియల్, కమర్షియల్ అవసరాలు ఇక్కడ పెరిగిపోయాయి.
గచ్చిబౌలి ప్రాంతంలో అపార్ట్మెంట్/ ప్లాట్లు, చదరపు అడుగు కు ధర దాదాపు పది నుంచి 12 వేల వరకు ఉంది. ఇక ప్రస్తుతం హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో తీసే లాటరీ కి ఒక్కో ప్లాట్ ధర 26.4 లక్షల వరకు ఉంది. ఈ ధర నేపథ్యంలో ఒక్కో చదరపు అడుగుల plinth ఏరియా సుమారు 6000 వరకు అల్ప ఆదాయ వర్గాల వారికి అందుబాటులోకి వస్తుంది. దిగువ ఆదాయ వర్గం కింద దరఖాస్తుదారుల నెలవారి ఇన్కమ్ అర్హత నెలకు 50,000 వరకు మాత్రమే ఉండాలి. ప్లాట్ లకు సంబంధించిన ఈఎండి/ టోకెన్ అడ్వాన్స్ కింద లక్ష రూపాయలను రాష్ట్రంలోని ఏదైనా మీ సేవ కేంద్రంలో చెల్లించవచ్చు.
అడ్వాన్స్ చెల్లించడానికి జనవరి 3 చివరి తేదీ అని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్లాట్లకు సంబంధించి జనవరి 6న ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు గచ్చిబౌలి ప్రాంతంలోని నిర్మిత్ కేంద్రాలలో లాటరీ తీస్తారు. ప్లాట్ దక్కించుకున్న వారు మొదటి 15 రోజుల్లో 25%, 60 రోజుల్లో 50%, 90 రోజుల్లో మిగతా 25 శాతం నగదు చెల్లించాలి. ఈ ప్లాట్లను పొందిన వ్యక్తులు ఐదు సంవత్సరాల వరకు వాటిని విక్రయించకూడదు. బదిలీ చేయకూడదు. లీజుకు కూడా ఇవ్వకూడదు. బ్యాంకు రుణం పొందడానికి మాత్రం అవకాశం ఉంటుంది . రాంకీ టవర్స్ పక్కన(ఏఐజి ఆసుపత్రి పక్కన) విక్రయానికి 40 ప్లాట్లు ఉన్నాయి. రాంకీ సీఈఓ క్వార్టర్స్ పక్కన 36 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వసంత ప్రాజెక్టు సమీపంలో 35 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి.