https://oktelugu.com/

panipuri vendor : ఈ పానీపూరి భయ్యా మామూలోడు కాదు.. ఏడాదిలో రూ.40 లక్షల సంపాదించాడు.. జీఎస్టీ నోటీసులతో వెలుగులోకి..!

పానీపూరీ.. దీనిని ఇష్టపడనివారు ఉండరు. పానీపూరి బండిని చూడగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ పానీపూరిని ఇష్టపడతారు. ఇక ఈ పానీపూరీ తయారు చేసేవారు, అమ్మేవారు అంతా చిరు వ్యాపారులే.

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2025 / 10:31 PM IST

    A panipuri vendor from Tamil Nadu earns a whopping Rs. 40 lakhs in a year

    Follow us on

    panipuri vendor : పాపీపూరి అమ్మేవారంతా చిరు వ్యాపారులే. ఉపాధి కోసం మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌ తదితర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లినవారు పానీ పూరీ అమ్మడం మొదలు పెట్టారు. క్రమంగా ఈ వ్యాపారం పుంజుకుంది. దీంతో వ్యాపారం విస్తరించింది. దీంతో చిరు వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఇక ఒప్పుడు వ్యాపారం కన్నా ప్రభుత్వ ఉద్యోగులే బాగా సంపాదిస్తారన్న అభిప్రాయం ఉండేది. కానీ, రానురాను పరిస్థితులు మారాయి. ఉద్యోగాల కన్నా ప్రేవేటు ఉద్యోగాల్లో వేతనాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక వ్యాపారం సక్సెస్‌ అయితే యజమానులు లక్ష్యాధికారులు, కోటీశ్వరులు అవుతున్నారు. ఇందుకు తాజాగా లక్షాధికారి అయిన పానీపూరి వ్యాపారే ఉదాహరణ. వీధివ్యాపారి కూడా లక్షల్లో సంపాదిచొచ్చని నిరూపించాడు.

    తమిళనాడులో పానీపూరీ వ్యాపారం..
    తమిళనాడుకు చెందిన ఓ పానీపూరీ వ్యాపారి ఏడాదిలో ఏకంగా రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇవి ఆన్‌లైన్‌ చెల్లింపులు మాత్రమే. ఇంకా నగదు రూపంలో వచ్చేవాటితో కలిపితే ఇంతకన్నా ఎక్కువగా సంపాదన ఉంటుంది. అయితే అతడు టాక్స్‌ కట్టకపోవడంతో జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు జారీ చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ వ్యాపారికి రేజర్‌ పే, ఫోన్‌పేల ద్వారా అందిన డేటా ప్రకారం వ్యాపారి వస్తువులు/సేవల సరఫరా కోసం పరిమితికి మించి యూపీఐ చెల్లింపులు చేశారని జీఎస్టీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 2021–22, 2022–23 20223–24 సంవత్సరాల్లో అతడు రూ.40,11,019 అందుకున్నట్లు తెలిపింది. జీఎస్టీ రూల్స్ ప్రకారం ఆ వ్యాపారి తన సంపాదనపై రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని తెలిపింది.

    నిబంధన ఇలా..
    జీఎస్టీ చట్టం 20217, సెక్షన్‌ 22లోని సబ్‌ సెక్షన్‌(1) ప్రకారం.. ఒక ఏడాదిలో రూ.20 లక్షల టర్నోవర్‌ కలిగిన ప్రతీ సరఫరాదారుడు కచ్చితంగా జీఎస్టీ నమోదు చేసుకోవాలి. పరిమతి దాటిన తర్వాత కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ లేకుండా వ్యాపారం చేయడం నేరం. ఇలాంటి నేరం చేసినవారికి రూ.10 వేలు లేదా టర్నోవర్‌లో 10 శాతం ఫైన్‌ విధిస్తారు. పానీపూరి అమ్ముకునే వ్యక్తికి వచ్చిన జీఎస్టీ నోటీస్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.