7 Seater Car: భారతదేశంలో 7 సీటర్ కార్లు అంటే ఎక్కువగా ఇష్టపడుతారు. ఇంటిల్లి పాది కలిసి ఒకేసారి ప్రయాణం చేయొచ్చు. విహార యాత్రలకు వెళ్లొచ్చు. బూట్ స్పేస్ ఎక్కువగా ఉండి ఇంజిన్ విషయంలో మిగతా కార్ల కంటే భిన్నంగా ఉండడం 7 సీటర్ కార్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. 7 సీటర్కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అయితే లో బడ్జెట్ లో కారుకొనాలనుకునేవారు 7 సీటర్ కారుకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇటీవల కొన్ని మోడళ్లు సామాన్యులకు అందుబాటులో 7 సీటర్ కార్లు ఉన్నాయి. అవి ఏవంటే?
సాధారణంగా 7 సీటర్ కారు అంటే రూ.10 లక్షలకు పైమాటే. కానీ రూ.7 లక్షలకు ఇలాంటి కారు వస్తుందంటే ఎవరూ నమ్మరు. కానీ మారుతి సుజుకీ కంపెనీ నుంచి ఈకో అనే కారును రూ.5.31 లక్షలకే అందిస్తోంది. ఇప్పటికే మారుతి నుంచి 7 సీటర్ ఎర్టిగా కారు ఉంది. కానీ దాని కంటే తక్కువ ధరకే ఈకో అనే కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. అత్యధికంగా సేల్స్ నమోదు చేసుకుంటున్న 7 సీటర్ కార్లలో ఇది నిలిచింది. ఈ కారు లీటర్ పెట్రోల్ కు19.71 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే సీఎన్ జీ వెర్షన్ లో 26.7 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.
7 సీటర్ కార్లలో రెనో ట్రైబర్ ప్రజాధరణ పొందింది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ట్రైబర్ నెలనెల సేల్స్ పెరుగుతున్నాయి. 999 సీసీ పెట్రోల్ ఇంజిన్ ను కలిగిన ఇది మాన్యువల్ ట్రాన్స్ మిషన్ మాత్రమే ఉంది. అలాగే ఈ కారు లీటర్ పెట్రోల్ కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రెనో ట్రైబర్ రూ.6.33 లక్షలకే విక్రయిస్తున్నారు. ఈ రెండు కార్లు అత్యధిక ప్రజాధరణ పొందుతూ తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి.
ఇప్పటికే మార్కెట్లో 7 సీటర్ కార్లు ఎన్నో ఉన్నాయి. మారుతికి చెందిన ఎర్టిగా రూ.8 లక్షలకు పైగానే విక్రయిస్తున్నారు. అలాగే కియా కారెన్స్, మహీంద్రా బొలెరో నియోప్లస్ వంటికి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కానీ రూ.7 లక్షలలో పై రెండు కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.