2024 Hatchback Cars:కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. మధ్యతరగి పీపుల్స్ ను దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు తక్కువ ధరకే కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వీటిలో హ్యాచ్ బ్యాక్ కార్లు ఎక్కువగా ఉండడం విశేషం. చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండడంతో పాటు దూర ప్రయాణాలు చేసేందుకు వీలుగా ఇవి ఉంటాయి. దీంతో వీటికి ఈ మధ్య డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పటి వరకు ఎన్నో హ్యాచ్ బ్యాక్ కార్లు వచ్చినా.. వినియోగదారులు లేటేస్ట్ ఫీచర్స్ తో పాటు ఆకర్షించే డిజైన్స్ ను కోరుకుంటున్నారు. దీంతో వారికి అనుగుణంగా 2024 ఏడాదిలో కొత్త కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వాటి గురించి వివరాల్లోకి వెళితే..
దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ మోడల్ ఎక్కువ అమ్మకాలు జరుపుకుంటోంది. అయితే దీనిని అప్డేట్ చేస్తూ కొత్తతరహాలో తయారు చేస్తున్నారు. పాత మోడల్ కంటే ఇది 15 ఎంఎం పొడవు, 40 ఎంఎం వెడల్పు తో రానుంది. ఇంకా ఇందులో ప్లోటింగ్ టచ్ స్క్రీన్, ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ వీల్, హెచ్ వీఉఏసీ కంట్రోల్స్, స్విచ్ గేర్ లతో పాటు కొత్త డిజైన్ ను కలిగి ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉన్న దీనిని మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు.
మారుతికి గట్టి పోటీ ఇస్తున్న టాటా కంపెనీ ఈ ఏడాదిలో హ్యాచ్ బ్యాక్ కారును అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని నుంచి ఆల్ట్రోజ్ రేసర్ అనే కారును 2023లోనే ఎక్స్ ఫోలో ప్రదర్శించింది. ఇది సాధారణ అల్ట్రోజ్ వలె డిజైన్ ను కలిగి ఉంటుంది. కానీ ఇందులో కొత్తగా 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7.0 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, వైర్ లెస్ చార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు 6 ఎయిర్ బ్యాగ్స్ రక్షణగా ఉంటాయి. ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ టర్భో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది.
కొరియన్ కంపెనీ హ్యుందాయ్ సైతం హ్యాచ్ బ్యాక్ లైన్లో ఉంది. దీన నుంచి రిలీజ్ చేయబడే ఐ 20 ని ఇటీవలే మార్కెట్లో ప్రదర్శించింది. ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు 118 బిహెచ్ పీ పవర్ 172 ఎన్ ఎం అవుట్ పుట్ లను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది. ఇంటిరీయర్ లో కొన్ని మార్పులు చేసి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.