https://oktelugu.com/

Income Tax Filers: దేశంలో ఐదు రెట్టు పెరిగిన కోటీశ్వరులు… తేల్చిన ఐటీఆర్‌!

భారత దేశంలో సంపన్నులు పెరుగుతున్నారు. ఐటీ రిటర్న దాఖలు ద్వారా కేంద్రం ఏటా సంపన్నుల వివరాలు సేకరిస్తుంది. గడిచిన ఐదేళ్లలో ఐదు రెట్లు కోటీశ్వరులు పెరిగారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 22, 2024 / 04:38 PM IST

    Income Tax Filers

    Follow us on

    Income Tax Filers: భారత దేవం అభివృద్ధి చెందుతున్న దేశం అంటూ ఇన్నాళ్లూ వింటున్నాం. చదువుకున్నాం. కానీ ఇప్పుడు భారత్‌ ప్రపంచ ఆర్థిక శక్తిలో ఐదో స్థానంలో ఉంది. గడిచిన పదేళ్లలో ఇది సాధ్యమైంది. ఇక ఇదే విధంగా మన దేశంలో కోటీశ్వరులు కూడా పెరుగుతున్నారు. గడిచిన ఐదేళ్లలోనే కోటీశ్వరులు గణనీయంగా పెరిగారు. ఇటీవల విడుదలైన ఓ రిపోర్టు ప్రకారం 2024లో భారతదేశంలో బిలియనీర్లు 1000 నుంచి 1,500కు పెరిగారు. వారిలో ఇప్పుడు 18 మంది వ్యక్తుల వద్దనే రూ.లక్ష కోట్లకు మించిన సంపద ఉందట. ఇక ఆదాయపుపన్ను గణాంకాలు కూడా దేశంలో కోటీశ్వరులు పెరుగుతున్నట్లు తేల్చాయి. గడిచిన ఐదేళ్లలో కోటికిపైగా ఆదాయం ప్రకటించినవారు ఐదు రెట్లు పెరిగారు. 2013–14(2012–13 ఆర్థిక సంవత్సరం)లో 44,078 మంది కోటికిపైగా ఆదాయపుపన్ను చెల్లించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఖ్య 2.3 లక్షలకు పెరిగింది. ఆదాయం పెరగడం, పన్ను అధికారుల చర్యల కారణంగా వృద్ధి నమోదైంది.

    ఏటా డేటా సేకరణ..
    ప్రభుత్వం ఆదాయపు పన్ను ఆధారంగా సంపన్నుల డేటాను సేకరిస్తుంది. ఆర్థిక వృద్ధిని అంచనా వేస్తుంది. ఈ డేటా ఆధారంగా పదేళ్ల క్రితం కోటీశ్వరులు దాఖలు చేసిన ఐటీ రిటర్నుల సంఖ్య 3.3 కోట్లు ఉండగా, గతేడాది వరకు ఈ సంఖ్య 7.5 కోట్లకు పెరిగింది. అంటే 2.2 రెట్లు పెరిగారు. కోటి రూపాయలకన్నా ఎక్కువ ఆదాయం ప్రకటించిన వారు 2022–23లో 49.2 శాతం ఉండగా 2023–24 నాటికి ఈ సంఖ్య 52 శాతానికి పెరిగింది. 2013–145లో కేవల ఒక వ్యక్తి మాత్రమే తన వద్ద రూ.500 కోట్లకుపైగా ఆదాయం ఉన్నట్లు ప్రనకటించారు. రూ.25 కోట్లరూపైగా ఆదాయం ఉన్నవారి సంఖ్య 1,812 నుంచి 1,798కి తగ్గింది. ఇక రూ.10 కోట్లకుపైగా ఆదాయం ఉన్నవారి సంఖ్య 1,656 నుంచి 1,577కి తగ్గింది.

    అత్యంత సంపన్నులు వీరే..
    ఇక దేశంలో అత్యంత సంపన్నులు ఎవరంటే టక్కున అంబానీ, లేదా అదానీ పేర్లే గుర్తొస్తాయి. ఒకసారి అంబానీ ఉంటే.. మరోసారి అదాని ఉంటారు. హురున్‌ ఇండియా రిచ్‌ రిపోర్టు ప్రకారం 2024లో గౌతం అదాని దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. ముఖేశ్‌ అంబానీ 2వ స్థానానికి పడిపోయారు. అదానీ, అంబానీ తర్వాత శివ్‌ నాడార్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కుటుంబం మొత్తం రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో మూడవ స్థానంలో ఉన్నారు. ఇక నాలుగో స్థానంలో సైరస్‌ ఎస్‌.పునావాలా ఉన్నారు. ఆయన సంపద రూ.2.89 లక్షల కోట్లు. ఇక సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కుటుంబం రూ.2.49 లక్షల కోట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇక హురున్‌ ఇండియా రిపోర్టు ప్రకారం దేశంలో బిలియనీర్లు పెరిగారు. ఈ సంఖ్య మొదటిసారి 300 దాటి 334కు చేరింది. అదనంగా భారత దేశంలో 1,000 కోట్లకుపైగా సంపద కలిగిన వ్యక్తులు కూడా 1,500కి పెరిగింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే 150 శాతం పెరుగుదల ఉంది.

    ఐదు రోజులకు ఒక బిలియనీర్‌..
    హురున్‌ రిచ్‌ లిస్ట్‌ ప్రకారం 2024లో భారత దేశంలో ప్రతీ ఐదు రోజులకు ఒకరు బిలియనీర్‌ అయ్యారు. అల్ట్రా–హై–నెట్‌–వర్త్‌ వ్యక్తుల సంఖ్య 220 పెరిగి 1,539కి చేరుకుంది. జాబితాలో 272 మంది కొత్తగా చేరారు. దేశంలో అల్ట్రా–హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 1,500 దాటడం ఇదే మొదటిసారి. గడిచిన ఐదేళ్లలో 86% పెరుగుదలను సూచిస్తోంది. దేశంలో ప్రస్తుతం 18 మంది రూ.లక్షల కోట్లకుపైగా సందప కలిగి ఉన్నారు.