Mrunal Thakur: సీతారామం మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్నారు. సీతారామం ఆమెకు భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందింది. కాగా తాజా ఇంటర్వ్యూలో మృణాల్ కెరీర్ లో ఎదురైన ఇబ్బందులు, అవమానాల గురించి వెల్లడించారు. నాన్న బ్యాంక్ ఎంప్లొయ్ కావడంతో అనేక స్కూల్స్ లో చదివాను. అందుకే నాకు స్కూల్ ఫ్రెండ్స్ లేరు. మొదట జర్నలిస్ట్ అవుదామనుకున్నాను. జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశాను. అలాగే డాక్టర్ కావాలనే ఆలోచన కూడా ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరిగాయి.

అయితే అనుకోకుండా మోడలింగ్ వైపు అడుగులు వేశాను. సీరియల్ నటిగా అవకాశాలు వచ్చాయి. కుంకుమ భాగ్య నాకు బాగా గుర్తింపు తెచ్చింది. ఆ సీరియల్ ఇతర భాషల్లో డబ్బింగ్ కావడం జరిగింది. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో అనేక అనుమానాలు ఎదురయ్యాయి. సీరియల్ ఆర్టిస్ట్ అనగానే చిన్న చూపు చూసేవారు. సినిమాలకు సీరియల్ వాళ్ళు పనికిరారని తిరస్కరించేవారు. అలాగే నా ఫిజిక్ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. నేను కుండలా ఉంటానట. ఇండస్ట్రీలో మట్కా(కుండ) అని నిక్ నేమ్ పెట్టేశారు.
Also Read: Prabhas Adipurush: భయంతో ఆదిపురుష్ మూవీ చేశాం ఇకపై రాముని దయ…!
సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ మూవీ హీరోయిన్ గా నేను ఎంపికయ్యాను. ఆ మూవీలో పాత్ర కోసం మల్లయుద్ధం నేర్పారు. దాంతో బాగా బరువు తగ్గాను. అనూహ్యంగా నన్ను తప్పించి అనుష్క శర్మను తీసుకున్నారు. తర్వాత నాకు ‘లవ్ సోనియా’ మూవీలో ఆఫర్ వచ్చింది. ఆ మూవీ వ్యభిచార కూపంలో చిక్కుకున్న చెల్లిని కాపాడే అక్క కథ. ఈ మూవీ షూట్ కి ముందు వారం రోజులు కలకత్తా రెడ్ లైట్ ఏరియాలో ఉన్నాను. సెక్స్ వర్కర్స్ జీవితాల గురించి లోతుగా తెలుసుకున్నాను.

లవ్ సోనియా షూటింగ్ సెట్స్ లో కొన్ని సీన్స్ లో నటించలేకపోయాను. సెక్స్ వర్కర్స్ దుర్భర జీవితాలు గుర్తొకొచ్చి మెదడు బద్దలైపోయేది. చివరికి దర్శకుడు ప్రోత్సాహంతో చేయగలిగాను. లవ్ సోనియా నాకు గుర్తింపు తెచ్చింది. తర్వాత స్టార్స్ పక్కన అవకాశాలు వచ్చాయి. ఓ ఇంటెర్నేషనల్ ఈవెంట్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో పరిచయం ఏర్పడింది. ఆ విధంగా సీతారామం ఆఫర్ వచ్చిందని, మృణాల్ చెప్పుకొచ్చారు.
Also Read:Adipurush Teaser: ఇది బొమ్మల సినిమానా? ఆదిపురుష్ టీజర్ లోని ప్రధాన లోపాలివీ..?