Homeఎంటర్టైన్మెంట్Swara Bhaskar: హీరోయిన్‌కు కరోనా.. చనిపోవాలంటూ కామెంట్స్..!

Swara Bhaskar: హీరోయిన్‌కు కరోనా.. చనిపోవాలంటూ కామెంట్స్..!

Swara Bhaskar: 2022 సంవత్సరం ప్రారంభం నుంచే దేశంలో కరోనా థర్డ్ వేవ్ సూచనలు కన్పిస్తున్నాయి. న్యూ ఇయర్ తర్వాత కరోనా కేసులు దేశ వ్యాప్తంగా లక్షల్లో నమోదవుతున్నాయి. గతంలో కరోనా నుంచి తప్పించుకున్న వారంతా ఈసారి కరోనా బారినపడేలా అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతలా కరోనా థర్డ్ వేవ్ ముంపు ప్రజలను ఆందోళనలకు గురిచేస్తోంది.

swara bhaskar

తాజాగా సినీ సెలబ్రెటీలంతా కరోనా బారిన పడుతుండటం చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, వెటరన్ బ్యూటీ త్రిష, బాహుబలి ‘కటప్ప’ సత్యరాజ్, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ కరోనా బారిన పడ్డారు. వీరంతా త్వరగా కోలుకోవాలని వారి ఫ్యాన్స్ #Getwellsoon అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

అయితే దీనికి భిన్నంగా ఒక హీరోయిన్ కు కరోనా సోకితే నెటిజన్లు మాత్రం ఆమె త్వరగా చనిపోవాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా అడ్వాన్స్ గా ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ కామెంట్స్ చేస్తుండటం శోచనీయంగా మారింది. ఈ వ్యాఖ్యలపై ఆమె సైతం సైటర్ వేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..!

స్వర భాస్కర్ కు బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు ఉంది. 2009లో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన స్వరభాస్కర్ అనేక సినిమాలు, వెబ్ సిరీసులు, టెలివిజన్ సీరియల్స్ లో నటించింది. ‘తను వెడ్స్ మను’.. ‘ వీరి ది వెడ్డింగ్’ లాంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ‘వీరి ది వెడ్డింగ్’లో ఓ బోల్డ్ సన్నివేశంలో నటించిన విమర్శలు పాలైంది. ఈ వివాదం ఆమె మంచి పాపులారిటీ తీసుకొచ్చింది.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణించినపుడు ఆమె అతడి గర్ల్ ఫ్రెండ్ కు మద్దతు మాట్లాడి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. అలాగే స్వలింగ సంపర్కానికి మద్దతుగా మాట్లాడి విమర్శపాలైంది. కేంద్ర ప్రభుత్వంపై తరుచూ విమర్శలు చేస్తూ వివాదానికి ఆజ్యం పోస్తూ ఉంటుంది. ఈక్రమంలోనే ఆమె తనకు కరోనా సోకిందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా పలువురు ‘2022లో బెస్ట్ న్యూస్ ఇదే’ అని.. ‘మీ మరణ వార్త కోసం ఎదురు చూస్తుంటాం’ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ కామెంట్స్ చూసిన స్వరభాస్కర్ ఆ పోస్టులన్నీ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ‘ఇలాంటి వారందరికీ తాను తిండి పెడుతున్నానని.. కేవలం తనని ట్రోల్ చేస్తూ ఇలాంటి వారంతా పొట్ట పోసుకుంటున్నారంటూ’ కామెంట్ చేసింది. ఒకవేళ ‘తనకు ఏమైనా జరిగితే.. మీ జీవనాధారాన్ని కోల్పోతారని.. సో బ్రతకాలని కోరుకోండి’ అంటూ సెటైర్లు వేయడం ఆకట్టుకుంది. మరోవైపు ఆమె ఫ్యాన్స్ మాత్రం స్వరభాస్కర్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular