Bigg Boss Telugu OTT: టామ్ అండ్ జెర్రీ.. బిగ్ బాస్ ఓటీటీ చూస్తున్న వారందరికీ ఇప్పుడు కంటెస్టెంట్లు అఖిల్, బిందుమాధవిలను చూస్తే అదే అనిపిస్తోంది. ఇద్దరికీ క్షణం పడడం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా..వేయకున్నా.. భగ్గుమనేలా ఉంది. ప్రతిక్షణం ఇద్దరూ గొడవలు పెట్టుకుంటున్నారు. రెండు గ్రూపులుగా వాడిపోయి నానా రచ్చ చేస్తున్నారు. అయితే వీరి మధ్య అంతకుమించిన భావన ఉందన్న భావన తాజాగా బయటపడింది.
బిగ్ బాస్ గత సీజన్ లో ఫైనల్ వరకూ వచ్చి రన్నరప్ గా నిలిచిన అఖిల్ సార్ధక్ ప్రస్తుతం ఓటీటీలో ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు భారీగా ఓటింగ్ జరుగుతోంది. ఈసారి 17 మంది కంటెస్టెంట్లలో అఖిల్ తోపాటు బింధుమాదవి టాప్ 2లో నిలుస్తున్నారు. బిందుమాధవి ప్రస్తుతం అఖిల్ కంటే కూడా టైటిల్ ఫేవరేట్ గా మారింది. ఈమె నుంచే అఖిల్ కు గట్టి పోటీ ఉంటోంది. ఇద్దరి ఆటకు ప్రేక్షకులు ఫిదా అయ్యి ఓట్ల వర్షం కురిపిస్తున్నారు. కానీ ఈ ఇద్దరూ హౌస్ లో టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడూ ఫైట్ చేసుకుంటూనే ఉన్నారు.
Also Read: AP New Districts: ప్రభుత్వ పంతం.. కొత్త జిల్లాలకు తుది రూపం
అమ్మాయిలతో పులిహోర కలపడంలో దిట్ట అయిన అఖిల్ గత బిగ్ బాస్ సీజన్ లో హీరోయిన్ మోనాల్ గజ్జర్ తో చేసిన రోమాన్స్ అంతా ఇంతా కాదు.. ఆమెతో ముద్దులు, హగ్గులు, ప్రేమ ట్రాక్ తో ఫేమస్ అయ్యారు. ఇక బిగ్ బాస్ ఓటీటీలో అది ఇప్పుడిప్పుడే స్ట్రాట్ చేస్తున్నాడు. అయితే తన మనసులోని మాటను తాజాగా బయటపెట్టాడు.
కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా బిందుమాధవిని అఖిల్ బ్యాచ్ తీవ్రంగా దూషించడం.. దానికి ఆమె ఏడ్వడం.. తిరిగి అఖిల్ పై విరుచుకుపడడం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘నువ్వు ఫ్రెండ్ లేకుంటే బతకలేవు. ఏ గేమ్ కూడా ఒంటరిగా ఆడలేవు’ అంటూ అఖిల్ పై బిందుమాధవి రెచ్చిపోయింది. దీనికి అఖిల్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.
ఈ క్రమంలోనే బిందుమాధవి గురించి తన ఫ్రెండ్ ఆషురెడ్డితో ఓపెన్ అయ్యాడు అఖిల్. ‘లవ్ లో ఉండడం చాలా మంచి ఫీలింగ్ అని.. బిందుమాధవితో క్లోజ్ కావడానికి చాలా ట్రై చేశాను.. కానీ వర్కౌట్ కాలేదు’ అంటూ ఆమెపై ప్రేమను అఖిల్ వ్యక్తం చేశాడు. దీనికి ఆషురెడ్డి ‘ఆమెను ఇష్టపడుతున్నావా?’ అంటూ ప్రశ్నించింది.
అఖిల్ సమాధానమిస్తూ.. ‘నేను ఆల్ రెడీ ఒకరితో ప్రేమలో ఉన్నా నీకు తెలుసు కదా’ అంటూ ఆషురెడ్డితో చెబుతాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ తో అఖిల్ ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దాన్నే చెప్పుకొచ్చాడు. కానీ బిందుమాధవి ఒప్పుకుంటే ఆమెతో ప్రేమ కొనసాగించడానికి అఖిల్ రెడీగా ఉన్నట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. మొత్తంగా ఈ అలకరాజా అఖిల్ ఓవైపు పొట్లాడుకుంటూనే బిందుపై ప్రేమను లోలోపల ఒలకబోస్తున్నాడన్నమాట.. బిందు మాత్రం అఖిల్ ను ఆ ఉద్దేశంతో చూస్తున్నట్టు కనిపించడం లేదు.
Also Read: Alia Bhatt: ‘ఆర్ఆర్ఆర్’ వివాదం పై ‘ఆలియా భట్’ స్పందన
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Bigg boss telugu ott akhil fights with bindu madhavi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com