బిగ్ బాస్ నాలుగో వారంలోకి చేరుకుంది. సోమవారం వచ్చిదంటే చాలు రచ్చ రంబోలా అవుతోంది. హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ చినిగి చాటవుతోంది. గొడవలు, కొట్లాటలు, ఆగ్రహ జ్వాలలు.. ఇలా కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నట్టుగా సాగుతోంది. హౌస్ లో ఎమోషన్స్ పీక్ స్టేజీకి చేరుకుంటుండగా.. ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత మజా పంచుతోంది.
బిగ్ బాస్ లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా.. నవ్వించినా.. నవ్వించకపోయినా.. ఏ చిన్న తప్పు చేసినా.. చేయకున్నా సరే కంటెస్టెంట్లు కారణాలు చూపి నామినేట్ చేయాల్సి ఉంటుంది. హౌస్ లో అందరూ దీన్ని భరించాల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు నామినేట్ కావాల్సిందే. ప్రతి సోమవారం దీన్ని చేపడతారు. అదే రోజు హౌస్ రసాభాసగా సాగుతుంది.
మొదటి వారం బూతులతో రచ్చ చేసిన ‘సరయు’ వెళ్లింది. రెండో వారం అదే బూతు పదాలు వాడిన ‘ఉమాదేవి’ ఎలిమినేట్ అయిపోయింది. మూడో వారం అర్ధరాత్రి బాత్రూంలో యాంకర్ రవికి లహరి హగ్ ఇచ్చిందన్న ప్రియ వ్యాఖ్యలు చేయడం తో హౌస్ నుంచి లహరి ఎలిమినేట్ అయ్యింది.
సరయూ, ఉమాదేవి, లహరి వెళ్లిపోవడంతో ఇప్పుడు హౌస్ లో 16 మంది సభ్యులున్నారు. బిగ్ బాస్ నుంచి లీక్ అయిన సమాచారం మేరకు ఈ వారం నామినేషన్స్ లో సిరి, కాజల్, లోబో, సన్నీ, ఆని మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియ, రవి ఉన్నారట.. మొత్తానికి అత్యధికం గా 8 మంది నామినేషన్స్ లోకి వచ్చారట. వరుసగా మూడు వారాలు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే నాలుగో వారం మాత్రం కచ్చితంగా మేల్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ ను వీడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా ఫైర్ ఉంటుందని అంటున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bigg boss 5 telugu fourth week nominated contestants
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com