Nayeem Dairies: ప్రముఖ గ్యాంగ్స్టర్ నయీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా నయీమ్ డైరీస్. తాజాగా ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత ఈ సినిమా బృందానికి తెలంగాణ హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇటీవలే ఈ సినిమాలో తెలంగాణ ఉద్యమ కారులైన బెల్లి లలితను ఇందులో అసభ్యంగా చూపించారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఆమె కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నయూం డైరీస్ సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు తొలగించే వరకు సినిమా ఆపేయని ఆదేశించారు.
అయితే చిత్రబృందం స్పందిస్తూ.. ఆ సీన్లను తొలగించేందుకు రెండ్రోజుల గడువు కావాలని కోరారు.. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాలో సీన్స్ తొలగించాలని చెప్పి.. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది తెలంగాణా హైకోర్టు. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన రోజే తెలంగాణలో పలు చోట్ల ఈ సినిమాను అడ్డుకున్నారు.
నయూం గ్యాంగ్స్టర్ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీం.. ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఈ క్రమంలోనే గతంలో రామ్గోపాల్ వర్మ కూడా ఇతనిపై సినమా తీస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ తర్వాత మళ్లీ ఆర్జీవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Big shock to naeem dairees in high court
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com