Gopichand Malineni- Balakrishna: బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ మాస్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతుంది. బాలయ్య కెరీర్ లోనే భారీ యాక్షన్ సినిమా అంటూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. పైగా ఈ మధ్య కాలంలో బాలయ్య చిత్రాల్లో సుదీర్ఘంగా నిర్మాణం జరుపుకుంటున్న సినిమా కూడా ఇదే. ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ కి నాలుగు సార్లు రీషూట్ చేసుకుంటూ పోతున్నాడు గోపీచంద్ మలినేని.
మొదటి రోజు నుంచి ఈ సినిమా నాలుగు అడుగులు వెనక్కు, రెండు అడుగులు ముందుకు అన్నట్లు సాగుతూ ఉంది. సహజంగా తన సినిమాల షూటింగ్ విషయంలో బాలయ్య పనితనం చాలా వేగంగా ఉంటుంది. ప్లాన్ చేసిన షెడ్యూల్ ను రెండు రోజులు ముందుగానే పూర్తి చేయడం బాలయ్యకి ఉన్న అలవాటు. కానీ భారీ సెట్లు వేసి సినిమాని చుట్టేయడం దర్శకుడికి నచ్చడం లేదు.
Also Read: Naga Chaitanya- Samantha: సమంత డబుల్ మీనింగ్ పై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్
దర్శకుడు గోపీచంద్ ల్యాగ్ టేకింగ్ ఇటు బాలయ్యకు నచ్చలేదు. ఇది గ్రహించిన గోపీచంద్.. ఈ సినిమాని వేగంగా పూర్తి చేయడానికి ‘లో క్వాలిటీ’ సెట్ లు, లోకల్ కాస్ట్యూమ్ లు తెచ్చి షూటింగ్ ప్లాన్ చేశాడు. ఎప్పటిలాగే బాలయ్య సెట్ కి ముందుగానే చేరుకున్నాడు. అక్కడ సెట్ లు, కాస్ట్యూమ్స్ వగైరా విషయాలు చూసి బాలయ్యలో ఆగ్రహం ఒక్కసారిగా రెట్టింపు అయింది.
సెట్ లో అందరూ ఉండగానే ‘ఏమయ్యా గోపీ.. ఇటు రా’ అని అరిచాడు. గోపీచంద్ మలినేని వచ్చి ఎదురు నుంచున్నాడు. అంతే.. అతని పై బాలయ్య సడెన్ గా సీరియస్ అయ్యారు. ‘సినిమా స్పీడ్ గా తీయడం అంటే.. ఏది పడితే అది చుట్టేయడం కాదురా, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని.. అన్నిటికి న్యాయం చేయడం’ అంటూ బాలయ్య పెద్ద క్లాస్ పీకాడట. దీనికితోడు ‘నువ్వు చేస్తున్న ఈ సినిమా క్వాలిటీ నాకు అస్సలు నచ్చడం లేదు’ అంటూ బాలయ్య, గోపీచంద్ మలినేని మొహం మీద తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు.
మొత్తానికి ఈ నెల 16న నుంచి జరగాల్సిన కొత్త షెడ్యూల్ ను బాలయ్య క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. పైగా ‘నాకు చెప్పినదేమిటి ? తీస్తున్నదేమిటి ?’ ఎట్టిపరిస్థితుల్లో కథ చెప్పినట్టుగానే ఈ సినిమా ఉండాలంటూ గోపీచంద్ కి బాలయ్య వార్నింగ్ కూడా ఇచ్చాడట. మరి గోపీచంద్ మలినేని, ఈ సారి బాలయ్యను ఎలా మెప్పిస్తాడో చూడాలి.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More