Karma : ‘కర్మ’ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మంచి పనులు చేస్తూ.. మంచిగా ప్రవర్తించడం ద్వారా వచ్చేజన్మలోనైనా పుణ్యఫలం దక్కుతుందని మహాభారతం చెబుతుంది.

Written By: NARESH, Updated On : December 16, 2023 5:56 pm
Follow us on

Karma : ప్రపంచంలో మనుషులంతా ఒక్కటే. కానీ వారి మనస్తత్వాల్లో చాలా తేడాలు ఉంటాయి. చేతికి ఉన్న ఐదు వేళ్లు ఎలా కామన్ గా ఉండవో..ఏ ఇద్దరు మనుషుల గుణాలు సేమ్ ఉండవు. వారి వారి జీవితాల్లో చాలా తేడాలు ఉంటాయి. కొందరు పుట్టగానే బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టారంటారు. ఎందుకంటే మొదటి నుంచే వారి జీవితం బాగుంటుంది. మరికొందరు పుట్టుకతోనే ఎన్నో కష్టాలను వెంట తెచ్చుకుంటారు. జీవితాంతం కష్టపడుతారు. ఇలా రకరకాల జీవితం ఉండడానికి ‘కర్మ’నే కారణంగా అని చాలా మంది అంటారు. ఇంతకీ ‘కర్మ’ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?

మహాభారతం గురించి చాలా మంది భారతీయులకు తెలిసే ఉంటుంది. ఇందులో ఒక లైను మనుషుల జీవితాలను నడిపిస్తుంటుంది. ఈ లైన్ ప్రకారం మనుషులు ఎలాంటి పనులు చేస్తారు. అదే విధంగా ప్రతిఫలం అనుభవిస్తారు. మంచి చేసిన వారు పుణ్యాన్ని.. చెడు చేసిన వారు పాపాన్ని మూటగట్టుకుంటారని తెలుపుతుంది. ఒక మనిషిన తనకు ఏ బాధ లేని సమయంలో గర్వంగా విర్రవీగుతూ చేసే తప్పులు తాను కష్టాల్లో ఉన్నప్పుడు మరింత కుంగేలా చేస్తాయి. దీనినే కర్మ అంటారు. మహాభారతం గురించి తెలుసుకున్న వారికి ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వారికి కర్మ గురించి అర్థమవుతుంది.

కొందరు ఎలాంటి తప్పులు చేయకున్నా.. గుళ్లు, గోపురాలు సందర్శించినా.. ఇతరులతో మంచిగా ప్రవర్తించినా.. వారి జీవితాల్లో కష్టాలు వెంటాడుతాయి. వారు ఏ పనిచేసినా అడ్డంకులు ఎదురై వారిని నష్టపెడుతూ ఉంటాయి. దీనికి వారు ఎంత మంచిగా ఉన్నా.. ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తాయి? ఏమిటీ ఈ కర్మ? అని బాధపడుతూ ఉంటారు. అందుకు వారు గత జన్మలో చేసుకున్న తప్పులే అని మహాభారతం చెబుతుంది. ఒక జన్మంలో చేసిన పాపాలు ఆ జన్మలో వీలుగా కాకపోత జన్మజన్మలా వెంటాడుతూ ఉంటాయి.

కర్మ నుంచి తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక జన్మలో ఎన్ని మంచి పనులు చేసిన కష్టాలు వస్తాయి కావొచ్చు. కానీ ఆ పుణ్యఫలం మరో జన్మలో వారికి తోడవుతుంది. ఈ జన్మంలో చేసిన మంచి పనులు వచ్చే జన్మలో వారికి మంచి జరుగుతాయిన మహాభారతం చెబుతుంది. అందువల్ల ఈ జన్మలో ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మంచి పనులు చేస్తూ.. మంచిగా ప్రవర్తించడం ద్వారా వచ్చేజన్మలోనైనా పుణ్యఫలం దక్కుతుందని మహాభారతం చెబుతుంది.