Vastu Tips : వాస్తు బాగుంటే ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటే ఇంట్లో ఉన్నవారు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే అల్లర్లు, టెన్షన్లు, మనస్పర్ధలు వస్తూ ఆ కుటుంబంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. కొందరు ఈ వాస్తు దోషాలను నమ్మితే మరికొందరు మూఢనమ్మకాలు అంటారు. కానీ కొన్ని నివారణ మార్గాలు చేసిన తర్వాత రిజల్ట్ ను చూసి నమ్ముతుంటారు మరికొందరు. అయితే వాస్తు దోషం వల్ల వచ్చే ప్రతికూల శక్తులు వ్యక్తుల జీవితాలపైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయట.
ఈ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే నెగిటివిటీని, ప్రతికూల శక్తులను దూరం చేసి, ఇంట్లో ఉన్న దోషాలను తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషించేది.. చాలా సమర్థవంతమైనది కర్పూరం. మీ ఇంట్లో గనుక వాస్తు దోషం ఉంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే కొన్ని నివారణ మార్గాలు పాటిస్తే ఇంట్లో ఉన్న నెగిటివిటీ నుంచి వాస్తు దోషం నుంచి కచ్చితంగా బయటపడవచ్చట. దీనికోసం కేవలం ఇంట్లో ఒక కర్పూరం ఉంటే చాలు. ఒక్క కర్పూరం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి దీనితో ఎలాంటి నివారణ మార్గాలు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక కర్పూరాన్ని తీసుకొని అన్ని గదుల మూలల్లో కర్పూరాన్ని ఉంచాలి. ఇలా ఏ మూలలో అయినా పెట్టిన కర్పూరం అయిపోతే ఆ స్థానంలో మరొక కర్పూరాన్ని పెట్టాలి. అంతేకాదు రోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరం వెలిగించి, దేశీ నెయ్యితో ఇల్లంతా ధూపం వేయాలి. ప్రతి రోజు రాత్రి వంటగదిలో పని అయిపోయిన తర్వాత ఒక శుభ్రమైన డబ్బాలో కర్పూరాన్ని, లవంగాన్ని కలిపి కాల్చడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అంతేకాదు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు కర్పూరపు నూనెను కలపాలి. ఈ నీటితో స్నానం చేస్తే శరీరం చాలా ఉత్తేజంగా తయారవుతుంది.
లవంగాలను, కర్పూరాన్ని కలిపి కాలుస్తూ ఇల్లంతా ధూపం వేస్తే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు, చిరాకులు తొలిగిపోతాయి. ప్రతి రోజు సాయంత్రం ఆగ్నేయ దిశలో కర్పూరాన్ని వెలిగించడం వల్ల సిరి సంపదలు మీ సొంతం అవుతాయి. ఇదిలా ఉంటే వాస్తు శాస్త్రంలో వాస్తు దోష నివారణకు కర్పూరం ప్రధాన పాత్ర పోషిస్తుందంటారు పండితులు. మరి మీరు కూడా వీలు ఉంటే ఈ నివారణను చేసి చూడండి. ఫలితాలను పొందుతారు. పెద్దగా ఖర్చు లేని, సింపుల్ టిప్ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం..