జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 13న సోమవారం ద్వాదశ రాశులపై విశాఖ, అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో అమావాస్య సందర్భంగా కొన్ని రాశుల వారికి లాభం జరగనుంది. 2023 నవంబర్ 13న 12 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది.
వృషభం:
కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామితో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. ఇతరులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు.
మిథునం:
బంధువులతో కలిసి విహారయాత్రలకు వెళ్లొచ్చు. మీ అభివృద్ధిపై ప్రత్యర్థుల దృష్టి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఖర్చులు పెరిగే అవకాశం. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. వ్యాపారులు పెట్టుబడి పెట్టే ముందు ఇంట్లో వాళ్లను సంప్రదించాలి. భాగస్వామితో కలిసి షాపింగ్ చేయచ్చు.
సింహం:
ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలి. పిల్లల భవిష్యత్ పై ప్రణాళిక వేస్తారు. ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండాలి. మాటలతో బంధుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కన్య:
ఆస్తుల విషయంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. అయితే పెద్దవారితో వాదనలకు దిగొద్దు. మాటలు మాట్లడడంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబంలో స్పల్ప ఉద్రిక్తం ఉంటుంది.
తుల:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. సాయంత్రం కొన్ని విషయాలపై కష్టపడాల్సి వస్తుంది.
వృశ్చికం:
అన్ని రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. అయితే మిమ్మల్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
వ్యాపారానికి సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల సలహాలు తీసుకోవాలి. ఆలోచనాత్మకంగా పనులు పూర్తి చేయాలి.
మకరం:
చేసే ప్రతిపనిపై శ్రద్ధ వహించాలి. దీంతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. కొత్త పనిని ప్రారంభించే ముందు బంధువుల సలహాలు తీసుకోవాలి.
కుంభం:
తెలిసిన వ్యక్తులతో వాగ్వాదానికి దిగొద్దు. మీరు చేసే పనులపై దృష్టి పెట్టారు. ఉద్యోగులు, వ్యాపారులు కొన్ని శుభ పలితాలు వింటాలరు. ఎవరినీ ఊరికే నమ్మొద్దు.
మీనం:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వివాహం చేసుకోబోయేవారు శుభవార్త వింటారు. వ్యాపారులు నిర్ణయాలు తీసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి.