https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి ఉద్యోగులకు నేడు ఆకస్మిక అదృష్టం..

2024 మార్చి 26న ద్వాదశ రాశులపై హస్తా, చిత్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : March 26, 2024 / 08:18 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: 2024 మార్చి 26న ద్వాదశ రాశులపై హస్తా, చిత్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా ఓ రాశి ఉద్యోగులకు ఆకస్మిక అదృష్టం వరించనుంది. ఈ సందర్భంగా 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేషరాశి:
    ఈరాశి వారికి ఈరోజు అనుకూల వాతావరణం. వ్యాపారులు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. ఉద్యోగులకు ఉల్లాసమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.

    వృషభ రాశి:
    వ్యాపారులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునేవారు శుభవార్తలు వింటారు. ప్రమాదరక పనులకు దూరంగా ఉండాలి.

    మిథునం:
    పాత తప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. స్నేహిుతులను కలుస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం వల్ల సంతోషంగా ఉంటారు.

    కర్కాటకం:
    కొన్ని పనులు పూర్తి చేయకపోవడంతో నిరాశతో ఉంటారు. రోజూవారీ పనుల్లో మార్పులు ఉంటాయి. రాజకీయాల్లో ఉండేవారికి కొన్ని ప్రయోజనాలు.

    సింహ:
    ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక అదృష్టం వరిస్తుంది. ఇతరులకు సలహాలు ఇవ్వడం మానుకోవాలి. ప్రభుత్వ రంగంలో వారు తమ విధులపై జాగ్రత్తగా ఉండాలి.

    కన్య:
    పిల్లల విషయంలో వాదనలకు దిగొద్దు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. భవిష్యత్ కోసం డబ్బును ఆదా చేస్తే అవి మంచి లాభాలు ఇస్తాయి.

    తుల:
    ఉద్యోగులకు అనుకూలవాతావరణం. వ్యాపారులు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు. గతంలో నిర్ణయించుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. చాలా కాలం తరువాత ఓ స్నేహితుడిని కలుస్తారు.

    వృశ్చికం:
    ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఇతరులపై పనిపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    ధనస్సు:
    జీవిత భాగస్వామితో దూర ప్రయాణానికి ప్లాన్ వేస్తారు. వ్యాపార రంగంలోని వారు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. శత్రువలు పట్ల జాగ్రత్తగా ఉండాలి.

    మకర:
    కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఓ విషయంలో వాగ్వాదానికి దిగుతారు. వ్యాపారులు పెట్టుబడులపై ఇతరుల సలహా తీసుకుంటారు.

    కుంభం:
    ఆర్థిక వ్యవహారాలతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బు అడిగే ఆస్కారం ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.

    మీనం:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని పనుల్లో నిరాశ ఉంటుంది. ఆదాయం పెరిగినా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులు పెట్టుబడి విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి.