Hanuman Chalisa : భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎంతో ఇప్పుడు చాలా పుస్తకాల్లో, గూగుల్‌లో వివరాలు ఉన్నాయి. ఈ వివరాలు అమెరికాకు చెందిన నాసా కనుగొన్నట్లు మాత్రమే మన పుస్తకాల్లో ఉంది. కానీ, నాసా కన్నా ముందే మన భారతీయులు సూర్యుడు, భూమికి మధ్య దూరాన్ని కొనుగొన్నారు. మన తులసీదాస్ రాసిన హనుమాన్ చాలీసాలో ఈ వివరాలు ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు కానీ, అందులోని పదాల అర్థం చాలా మంది తెలుసుకోరు.
యుగ సహస్ర యోజన పరభానూ..
మన కవి తులసీదాస్ హనుమాన్ చాలీసా రాసిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రతీ హనుమాన్ ఆలయంలో నిత్యం ఈ హనుమాన్ చాలీసా పఠనం జరుగుతుంది. భక్తులు పటించేలా ఆలయాల్లో పెద్దపెద్ద శిలాఫలకాలు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో సూర్యుడు భూమికి మధ్య ఉన్న దూరం ఉందన్నది గమనించడం లేదు. ‘‘యుగ సహస్ద్ర యోజనపరభాను.. లీల్యోతాపి మధుర ఫలజాను’’ అని ఉంటుంది. యుగ సహస్త్ర యోజనములు దూరంలో ఉన్న భానుడిని మధురఫలమని అనుకుని ఆంజనేయుడు అవలీలగా నోటిలో వేసుకున్నాడు అని అర్థం.
లెక్క ఇలా..
యుగ అంటే 12 వేల సంవవత్సరాలు, సహస్ర అంటే వెయ్యి, యోజన అంటే 8 మైళ్లు అని అర్థం. యుగ x సహస్ర x యోజన అంటే.. 12,000×1,000 x 8 = 9,60,00,000 మైళ్లు. ఒక మైలు అంటే 1.6 కిలోమీటర్లు . 9,60,00,000 మైళ్లు అంటే
9,60,00,00 x 1.6 = 15,36,00,00 కోట్ల కిలోమీటర్లు అన్నమాట.
నాసా లెక్క కూడా ఇదే..
ఇక అమెరికాకు చెందిన నాసా కూడా శాస్త్రీయంగా, సాంకేతిక పద్ధతి ఉపయోగించి సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని కొలిచింది. నాసా లెక్క కూడా 15,36,00,000 దూరమే. ఆశ్యర్యంగా ఉంది కదూ. మన శాస్త్రం, సంస్కృతి గొప్పదనం ఇదీ.