- Telugu News » Ap » Tirumala darshan is allowed from the steps of srivari
తిరుమల: శ్రీవారి మెట్ల నుంచి దర్శనానికి అనుమతి
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. కరోనా కారణంగా అలిపిరి, శ్రీవారి మెట్ల దారులను మూసివేశారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులు ఇక నుంచి శ్రీవారి మెట్ల మార్గంలో రావడానికి అనుమతినిచ్చింది. గురువారం నుంచి ఈ మెట్ల ద్వారా భక్తలు రావచ్చని తెలుపుతూ ప్రకటన చేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. దర్శనం టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే నడకదారిలో అనుమతిస్తామని పేర్కొంది. […]
Written By:
, Updated On : November 4, 2020 / 07:53 PM IST

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. కరోనా కారణంగా అలిపిరి, శ్రీవారి మెట్ల దారులను మూసివేశారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులు ఇక నుంచి శ్రీవారి మెట్ల మార్గంలో రావడానికి అనుమతినిచ్చింది. గురువారం నుంచి ఈ మెట్ల ద్వారా భక్తలు రావచ్చని తెలుపుతూ ప్రకటన చేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. దర్శనం టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే నడకదారిలో అనుమతిస్తామని పేర్కొంది. శ్రీవారి మెట్లనే నూరు మెట్లు అని కూడా అంటారు. ఇది శ్రీనివాస మంగాపురం నుంచి మొదలవుతుంది. దీంతో భక్తులు హర్షం వ్కక్తం చేస్తున్నారు.