
జిల్లాలోని వేలేరుపాడు మండలం ఏజెన్సీ గ్రామాల్లో పులి సంచరిచింది. కోయిదా, కట్కూరు, కావడిగుండ్ల అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లు అధికారులు చెబుతున్నారు. అశ్వరావుపేట ప్రాంతం నుంచి వచ్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అటవీప్రాంతంలోకి వెళ్లొద్దని అధికారుల సూచించారు. ఆదివారం ఏజెన్సీ గ్రామాల్లో పులి కనిపించింది. ఏజెన్సీలో పులి పంజా గుర్తులను గమనించారు. దీంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. పులి సంచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. మండలంలో పులి సంచరిస్తోందన్న వార్త జిల్లాలో దావానంలా పాకింది.