
ఆంధ్రప్రదేశ్ లో ఏకైక రాజధాని ఉండాలని, అది అమరావతియే ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం అమరావతిలో పార్టీ ఐదు నియోజకవర్గాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు జీవితంలో పారిపోవడం తెలియదన్నారు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు. అభిప్రాయాలు చెప్పాల్సి వచ్చినప్పడు ధైర్యంగా చెబుతామన్నారు. అమరావతి పై మా అభిప్రాయం ఇదేనన్నారు. పాలకులు పరిస్థితులకు తగ్గట్టు మాట మార్చేస్తున్నారని మండిపడ్డారు. పాలకులు విభజించి పాలించే విధానంతో వెళ్తున్నారన్నారు. అయితే సమస్య చెబితే వ్యక్తిగతంగా ధూషించడం తప్ప పరిష్కరిద్దామన్న ఆలోచన లేదన్నారు.