
అనంతపురం కలెక్టరేట్ ఎదుట సోమవారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి తన తల్లి డ్వాక్రా డబ్బుల విషయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లాడు. అధికారులతో మాట్లాడిన తరువాత పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కలెక్టరేట్ పరిసర ప్రాంగణం ఆందోళనకర వాతావరణం ఏర్పడింది.