
సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. జీఓ 77ను తక్షణం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. 77 జారీ చేయడం ద్వారా విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని తప్పుబట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగంలో మార్పులు తెస్తామన్న మార్పు ఇదేనా అని వీర్రాజు ప్రశ్నించారు. రీయింబర్స్‌మెంట్ నిలిపివేయడం వల్ల వీరు ఉన్నత విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీఓను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు. జగనన్న వసతి, విద్యాదీవెన పథకాలు అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.