
పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష ముగిసింది. అంతకుముందు పోలవరం పర్యటనలో భాగంగా తొలుత ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం జగన్ పరిశీలించారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో మాట్లాడుతూ… 2022 ఖరీఫ్ నాటికి సాగునీరు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రాజెక్టు ఒక్క మిల్లీ మీటరు కూడా తగ్గించడం లేదని స్పష్టం చేశారు.