
అమరావతిని రాజధానిగా ఉంచాలని స్థానిక రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం అమరావతి పోరాట సమితి నేతలు, కొందరు మహిళా రైతులతో భేటీ కానున్నారు. మరో 32 నియోజకవర్గాలలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంగళవారం జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం అమరావతిలో పర్యటించనున్నారు. కరోనా వైరస్ ఏపీలోకి ప్రవేశించినప్పటి నుంచి పవన్ రాష్ట్రంలో పర్యటటించలేదు. నిన్న ఏపీలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన పవన్ నేడు అమరావతిలో పర్యటించనున్నారు. అలాగే 32 నియోజకవర్గాల ఇన్ చార్జులతో సమావేశమై పార్టీ కార్యకలాపాలపై చర్చించనున్నారు.