
అంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాల్లో మరో బిల్లుకు ఆమోదం తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ చట్ట సవరణకు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. ఆర్థిక నేరాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోంమత్రి సుచరిత తెలిపారు. ఈ బిల్లు ఆమోదందో ఆన్లైన్ గేమ్ ప్రొత్సహించినా, నిర్వహించినా రెండేళ్లపాటు జైలుశిక్షతో పాటు భారీ జరిమానా విధించనున్నారు. కాగా ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఆన్ లైన్ గేమింగ్ పై చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఏపీలోనూ ఆన్లైన్ గేమింగ్ పై ఇక నుంచి చర్యలు తీసుకోనున్నారు.