
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో జన ఆరోగ్య సమితి (జేఏఎస్)లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది… కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జన ఆరోగ్య సమితిల ఏర్పాటుకు పూనుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్… దీనికి సంబంధించిన నిబంధనలపై ఉత్తర్వులు జారీ చేసింది… ఈ జేఏఎస్‌లను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ఇక, జేఏఎస్ ఛైర్మన్‌గా సంబంధిత గ్రామ సర్పంచ్ వ్యవహరించనుండగా… సహ ఛైర్మనుగా పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్, మెంబర్ సెక్రటరీగా మిడిల్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.