
విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. గుంటూరుకు చెందిన దివ్య తేజస్విని గొంతు కోసి.. నాగేంద్ర అనే యువకుడు గాయపర్చుకున్నాడు. ఈ సంఘటనలో తేజస్విని చికిత్స పొందుతూ మృతి చెందింది. గాయపర్చుకున్న నాగేంద్రను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అయితే శుక్రవారం ఈ కేసును విచారించిన పోలీసులకు కొత్త కోణాలు బయటపడ్డాయి. ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరులోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన దివ్య తేజస్వి, నాగేంద్రలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దివ్య నాగేంద్రను దూరం పెట్టడంతో తనపై దాడి చేసి తాను గాయపర్చుకున్నట్లు నాగేంద్ర తెలిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే దివ్య తల్లిదండ్రులు మాత్రం అవన్నీ అబద్ధాలేనని ఆరోపిస్తున్నారు.