
ఇటీవల వరదలకు గురైన పశ్చిమగోదావరి జిల్లాలోని ముంపు గ్రామల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కోల్లేరు పరిసన గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌లో కార్యకర్తలను ఎక్కించుకొని డ్రైవ్ చేశారు. ట్రాక్టర్ డ్రైవింగ్‌పై అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా నడిపారంటూ ఆయనపై ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మంగళవారం లోకేశ్ స్పందించారు. రైతుల్ని పరామర్శించడం, రైతులకు న్యాయం చేయాలనుకోవడం జగన్ దృష్టిలో నేరం అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ నెరంపై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్ద లేవని, అందుకే కోవడ్ నిబంధనలు ఉల్లంఘన బనాయించారని ఆరోపించారు.