
జనసేన పార్టీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పార్టీ అధినేత పవన్ కు షాక్ ఇచ్చాడు. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కుమారుడు రాపాక వెంకట్ ను వైసీపీలో చేర్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన కూడా హాజరు కావడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే సాంకేతికి కారణాలతో తాను వైసీపీలో చేరలేనని చెప్పాడు. కాగా మరోవైపు జనసేన ఈ పరిస్థతిని చూసి షాక్ తిన్నాడు. పార్టీకి ఉన్న ఎకైక ఎమ్మెుల్యే వైసీపీ వైపు చూడడంతో పార్టీ నాయకులు ఖంగు తిన్నారు. గత కొంతకాలంగా ఆయన జనసేనకు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చినా స్పందించలేదు. అయితే నిన్న అతని కుమారుడిని వైసీపీలో చేర్పించడంతో ఆయన జనసేనను వీడినట్లేనని అనుకుంటున్నారు.