
ప్రతి గిరిజన పేదకు 2 ఎకరాల భూమిని పంపిణీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గాంధీజయంతి సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. అందుకే గిరిజన సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గిరిజనులకు 2 ఎకరాల భూమి కేటీయిస్తామన్నారు. వర్చువల్ ద్వారా వారికి పట్టాలు పంపిణీ చేశారు. 1.53 లక్షల మందికి 3.12 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించారు. ఎలాంటి వివాదాలు లేకుండా భూములను డిజిటలైజేషన్ చేశారు.