
సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబును బీజేపీ నేత సోము వీర్రాజు తప్పుబట్టారు. జగన్, చంద్రబాబుకు పోలవరంపై ఉన్న చిత్తశుద్ధి.. రాయలసీమ నీటి ప్రాజెక్ట్‌లపై లేదని విమర్శించారు. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమ ప్రాజెక్ట్‌లకు పోలవరంలానే నిధులు ఇస్తామని ఆయన ప్రకటించారు. తమ పార్టీలో ఎవరు సీఎం అవుతారో తెలియదన్నారు. రాయలసీమ ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం బీజేపీ, జనసేనేనని సోమువీర్రాజు స్పష్టం చేశారు.