
ఆంధ్రప్రదేశ్లో వరదలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో గుంటూరు, క్రుష్ణా జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు పాల్గొని కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గుడివాడ, మచిలీ పట్నంలో పర్యటించారు. స్థానిక రైతులను కలిసి వారిని పరమర్శించారు. తుఫాను సాయం మరింత పెంచాలని డిమాండ్ చేశారు. పంట నష్టం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.