బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కాకినాడ వద్ద వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రంలోని విజయవాడలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణ జిల్లాలోని నూజివీడు, ఆగిరిపల్లి, ముసునురు, చాట్రాయి మండలాల్లో వాగులు వంకలు పొంగొపొర్లుతున్నాయి. పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. చాట్రాయి మండలం సోమవరం గ్రామంలో కోళ్లఫారంలోకి వరదనీరు రావడంతో 5000 కోడిపిల్లలు మృతి చెందారు.