తిరుమలలో భారీ వర్షం
ఏపీలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు తిరుమలలో ఎడతెరిపి లేని వాన పడుతోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా తిరుమలకు వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు 54వ మలుపు వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన అధికారులు కొండచరియలను తొలగించి రూట్ క్లియర్ చేశారు.మరోవైపు వైకుంఠ కాంప్లెక్స్ నుంచి వెళ్లే భక్తులు తడిసిముద్దయ్యారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు కొండలన్నీ తడిచి ముద్దయ్యాయి.
Written By:
, Updated On : November 16, 2020 / 12:03 PM IST