
రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు నిత్యకృత్యం అవడం దురదృష్టకరమని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదని… కనీసం గుళ్లో ఉన్న దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రభుత్వ అలసత్వ తీరు వల్లే ఈ దాడులు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. రాజమండ్రిలో విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని విధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ దురాగతాల నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.